ED Rainds Raj kundra: పోర్న్ రాకెట్ కేసు ఏంటీ..?.. శిల్పాశెట్టీ భర్త ఏంచేశాడో తెలుసా..?
శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై ఈడీ అధికారులు కేసును నమోదు చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ముంబైలోకి ఆయన నివాసంలో పాటు.. అనేక ప్రాంతాలలో ఈడీ సోదాలు చేస్తునట్లు సమాచారం. దీంతో పోర్న్ రాకేట్ కేసు మరోసారి తెరమీదకు వచ్చిందని చెప్పుకొవచ్చు.
ముంబైలోకి ఎంతో మంది అమాయక ఆడపిల్లలు.. సినిమాలలో చాన్స్ ల కోసం వస్తుంటారు. ఈ క్రమంలో శిల్పా శెట్టి భర్త.. అప్పట్లోనే బాలీవుడ్ లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పేవాడంట. ఈ క్రమంలో కొంత మంది అమాయక ఆడపిల్లలు ఆయన చెప్పిన మాటలు నమ్మి.. సినిమా చాన్స్ ల కోసం కలిసేవారు.
కానీ రాజ్ కుంద్రా.. వారి అవసరాలను , బలహీనతల్ని ఆసరాగా చేసుకుని వారిని పోర్న్ రోంపిలోకి నెట్టేవాడంట. ఈ నేపథ్యంలో ఒక బాలిక మలాడ్ వెస్ట్ లాండ్ లో జరుగుతున్న పోర్న్ గ్రఫీలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ సెర్చింగ్ నిర్వహించారు.
రాజ్ కుంద్రా.. పోర్న్ బండారం అంతా బైటపడింది. దీంతో 2021,ఫిబ్రవరి 4న పోలీసులు రాజ్ కుంద్రాతో పాటు.. మరో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. కొన్ని నెలల పాటు జైలు జీవితం అనుభవించిన తర్వాత రాజ్ కుంద్రా బెయిల్ మీదకు బైటకు వచ్చినట్లు తెలుస్తొంది.
ఈ క్రమంలో రాజ్ కుంద్రా.. అనేక మంది అమ్మాయిల దగ్గర నుంచి అక్రమంగా డబ్బులువసూలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు.. 2022 లోనేు ఈడీ మనీలాండరీంగ్ కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్పటి నుంచి రాజ్ కుంద్రాపై నిఘా పెట్టారంట. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈడీ అధికారులు మాత్రం.. రాజ్ కుంద్రాకు చెందిన ముంబైలోని నివాసం, మరో 15 ప్రాంతాలలో ప్రస్తుతం సెర్చింగ్ చేస్తున్నట్లు తెలుస్తొంది.
ప్రస్తుతం రాజ్ కుంద్రా నివాసంలోకి కీలక డ్యాక్యుమెంట్ లు, లాప్ టాప్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు.. 2017 లోనే.. బిట్ కాయిన్ ఘటనలో కూడా రాజ్ కుంద్రా, శిల్పశెట్టీలపై పోలీసులు కేసుల్ని నమోదు చేసినట్లు తెలుస్తొంది. మనీలాండరీంగ్ కేసులో ఇప్పటికే.. పోలీసులు.. శిల్ప దంపతుల ఆస్తులలో..రూ. 98 కోట్లను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈడీ మరల దూకుడుగా వ్యవహారించడం వార్తలలో నిలిచింది.