Eesha Rebba: వెరైటీ లుక్ లో సరికొత్త మేకోవర్ తో కెవ్వు కేక పుట్టిస్తున్న ఈషా రెబ్బ..

Mon, 24 Jun 2024-2:29 pm,

ఈషా రెబ్బ అచ్చ తెలుగు అందం కాబట్టే ఈమెకు సొంత భాషైన తెలుగులో  సరైన అవకాశాలు రావడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అట్రాక్ట్ చేసే అందం, అభినయం ఉన్నా.. సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు ఈ అచ్చ తెలుగు అమ్మాయికి. దీంతో  వరుస ఫోటో షూట్స్ ను నమ్ముకుంది.

 

ఈషా రెబ్బ ఒకవైపు సినిమాలు చేస్తూనే .. మరోవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. ఈషా ఇప్పటకే ‘పిట్ట  కథలు’ ‘త్రీ రోజెస్’ వంటి పలు వెబ్ సిరీస్ లో నటించింది.

 

ప్రస్తుతం ఈషా తెలుగుతో పాటు తమిళం, మలయాళ సినిమాల్లో నటిస్తోంది. అందుకే ఎప్పటి కపుడు తన ఫోటో షూట్ లతో హల్ చల్ చేస్తోంది.

ఆకట్టుకునే గ్లామర్  ఉన్న టాలీవుడ్ అగ్ర హీరోలెవరు ఈషాకు పిలిచి వరుస ఛాన్సులు మాత్రం ఇవ్వడం లేదనే చెప్పాలి.

తెలుగులో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ మూవీతో పరిచయమైన ఈషా రెబ్బ.. ఇంద్రగంటి మోహనక‌ృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంతకు ముందు ఆ తర్వాత‘ సినిమాలో నటించింది.

అటు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవింద సమేత వీరరాఘవ‘లో సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించినా ఈషా కెరీర్ కు పెద్దగా ఉపయోగపడింది లేదనే చెప్పాలి. పెద్ద హీరో సినిమాలో నటించాననే సంత‌ృప్తి తప్పితే ఈషాకు పెద్దగా ఒరిగిందేమి  లేదు. అందుకే వరుస ఫోటో షూట్స్ ను నమ్ముకుంది ఈషా.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link