Cockroach: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే బొద్దింకలు మీ ఇంటివైపు కన్నేత్తి కూడా చూడవు..
కొంత మంది తమ ఇళ్లలో బొద్దింకల సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా రాత్రి పూట బొద్దింకలు కిచెన్ లో ఎక్కువగా తిరుగుతుంటాయి. పొరపాటున ఎక్కడైన ఫుడ్ ఐటమ్స్ మీద మూట పెట్టడం మర్చిపోతే అంతే సంగతులు.
స్నాక్స్ ఐటమ్స్ లను ఎక్కడంటే అక్కడ పడేయకూడదని చెప్తుంటారు. దీనివల్ల లేని పోనీ వ్యాధులు వస్తాయి. బాత్రూమ్ లలో కూడా బొద్దింకలు తిరుగుతుంటాయి.
డ్రైనేజీ పైపుల్లో బొద్దింకలు ఎక్కువగా సంచరిస్తాయి. అంతే కాకుండా.. బాత్రూమ్ లలో కూడా బొద్దింకలు ఎక్కువగా తిరుగుతుంటాయి. అయితే.. బొద్దింకలు రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
మెయిన్ గా బొద్దింకలు ఉన్న ప్రదేశంలో బిర్యానీ ఆకుల్ని పెట్టాలి. నాఫ్తలీన్ గోలీలు, ఉప్పు కల్పిన నీరును బొద్దింకలు ఉన్న ప్రదేశంలో చల్లితే, వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు.
అంతే కాకుండా.. బొద్దింకలు ఉన్న ప్రదేశంలో కారం కల్పిన నీళ్లు, సున్నం నీళ్లను కూడా చల్లితే అవి ఆ వాసనకు దూరంగా వెళ్లిపోతాయంట. అందుకే ఈ టిప్స్ పాటించడం వల్ల కూడా బొద్దింకల నుంచి మనం ఇంటిని కాపాడుకొవచ్చు.