EPF Interest Rate: EPFO ఖాతాదారులకు కేంద్రం శుభవార్త, 6 కోట్ల మంది హర్షం
EPF Interest Rate 2020-21 | ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) ఖాతాదారులుగా ఉన్నారు. వీరికి 2019-20 ఏడాదికి సంబంధించిన 8.5 శాతం వడ్డీని ఈపీఎఫ్ ఖాతాలలో ఈపీఎఫ్‌వో, కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ జమచేసింది.
Also Read: EPFO: ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ సులువుగా చేసుకోవచ్చు, PF Transfer Online పూర్తి ప్రక్రియ ఇదే
EPF Interest Rate | ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, EPFO సంస్థలు ఈపీఎఫ్ ఖాతాదారులకు షాకిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని ప్రచారం జరిగింది. అయితే అందులో వాస్తవం లేదని తేలిపోయింది. ఈపీఎఫ్ నగదు నిల్వలలపై వడ్డీ రేట్లను 8.5 శాతంగా యథాతథంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Reliance Jio: కేవలం రూ.22తో రిలయన్స్ జియో డేటా ప్లాన్, తక్కువ ధరకు ఎన్నో ప్రయోజనాలు
Interest Rate On EPF | ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు గురువారం శ్రీనగర్‌లో సమావేశమై 2020-21 ఏడాదికి సంబంధించి EPF Interest Rates తగ్గించకూడదని నిర్ణయం తీసుకున్నారు. మార్చి 4వ తేదీన సమావేశమై ఈపీఎఫ్‌వో, కేంద్ర మంత్రిత్వ శాఖలు దీనిపై తుది నిర్ణయం తీసుకున్నాయి. ఈపీఎఫ్ వడ్డీ రేట్లు 8.5శాతంగా ఉంచాలని, తగ్గించరాదని చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నారు.
Also Read: EPFO: 4 విధాలుగా మీ ఖాతాల్లోని PF Balanceను సులువుగా చెక్ చేసుకోవచ్చు
EPFO ఖాతాదారులకు ప్రస్తుతం 8.5 శాతం వడ్డీని అందిస్తున్నారు. ఈ మేరకు 2019-20 ఆర్థిక సంవత్సరానికిగానూ చెల్లించాల్సిన వడ్డీని జనవరి నెలలో 6 కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేసింది. కరోనాతో ఇబ్బందులు పడ్డ 2020-21 సంవత్సరానికిగానూ EPFO ఖాతాదారులు గత ఏడాది పొందిన వడ్డీ శాతాన్నే అందుకోనున్నారు.
ఓవైపు ఇంధన ధరలు, LPG సిలిండర్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, మరోవైపు ఈపీఎఫ్ వడ్డీ రేట్లు తగ్గించడం సబబు కాదని భావించిన EPFO, కేంద్ర కార్మిక ఉపాధి శాక ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త అందించింది. ఒకవేళ ఈపీఎఫ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే 7ఏళ్ల కనిష్టానికి చేరనుందని చివరి నిమిషంలో వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచాలని నిర్ణయించారు.
Also Read: EPFO Alert: ఈపీఎఫ్ వడ్డీ రావాలంటే 40 లక్షల మంది ఖాతాదారులు ఇలా చేస్తే సరి