EPF New Rules: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు.. పూర్తి వివరాలివే

Tue, 24 Dec 2024-6:33 pm,

EPF New Rules: ప్రస్తుతం 24వ తేదీలోపు సెటిల్ అయిన క్లెయిమ్స్ కు ఇంతకుముందు నెలాఖరు వరకు మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తున్నారు. దీంతో సభ్యులు కొంత వడ్డీని కోల్పోతారు. నిబంధనలు మారిన తర్వాత విత్ డ్రా చేసుకునేందుకు నెల మధ్య దరఖాస్తు చేసుకున్న సభ్యులు ఆ అదనపు రోజులకు కూడా వడ్డీని అందుకోనున్నారు.   

ఒక నెల 20వ తేదీన కోటి బ్యాలెన్స్ ఉన్న వ్యక్తి విత్ డ్రా చేసుకుంటే ఇప్పుడు అదనంగా రూ. 44,335 వడ్డీని పొందనున్నారు. అదేవిధంగా రూ. 2కోట్ల ఉన్న సభ్యుడు అదనంగా రూ. 88,710 అందుకుంటారు. ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. 

అప్ డేట్ చేసిన వడ్డీ లెక్కింపు రూల్స్ ఈపీఎఫ్ సేవింగ్స్ ఫుల్ విత్ డ్రాలకు వర్తిస్తుంది. ఉదాహరణకు 55 ఏళ్ల వయస్సులో రిటైర్మెంట్ చేయడం, వైకల్యం కారణంగా రిటైర్మెంట్, విదేశాల్లో ఉపాధి, రెండు నెలల నిరుద్యోగం తర్వాత అకౌంట్ క్లోజ్ చేయడం వంటి వారికి అప్లయ్ అవుతుంది. విద్య, వివాహం లేదా ఇంటి నిర్మాణం వంటి ప్రయోజనాల కోసం పార్షియల్ గా విత్ డ్రాలకు వర్తించవు.   

అయితే క్లెయిమ్స్ 25వ తేదీ నుంచి నెలాఖరు వరకు ప్రాసెస్ కాకపోవడం ఆలస్యం అవుతుంది. కొత్త నిబంధనల ప్రకారం నెల పొడవునా క్లెయిమ్స్ ప్రాసెస్ అవుతాయి. దీంతో వేచి ఉండే సమయం చాలా వరకు తగ్గుతుంది. క్లెయిమ్స్ తొందరగా పరిష్కారం అవుతాయి.   

రిటైర్మెంట్ తర్వాత కూడా బ్యాలెన్స్ విత్ డ్రా చేయనట్లయితే ఈపీఎఫ్ అకౌంట్ మూడేళ్ల పాటు యాక్టివ్ గా ఉంటుంది. ఆ సమయంలో ప్రస్తుత రేటు ప్రకారం వడ్డీ లభిస్తుంది. మూడేళ్ల తర్వాత అకౌంట్ పనిచేయదు. దీంతో వడ్డీ ఆగిపోతుంది. రిటైర్మెంట్ తర్వాత వడ్డీపై సభ్యుడు పన్ను చెల్లించాల్సి వస్తుంది.   

సభ్యులు ఉద్యోగంలో ఉంటూనే 58ఏళ్ల తర్వాత కూడా ఈపీఎఫ్ అకౌంట్ కు కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. అయితే ఈ వయస్సులో ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ కి కాంట్రిబ్యూషన్స్ ఆగిపోతాయి. వాటికి బదులుగా యజమాని, ఉద్యోగి ఫండ్స్ అకౌంట్ కు వెళ్తాయి.   

యజమానులు ఉద్యోగి బేసిక్‌ శాలరీలో 8.33శాతం (నెలకు రూ.1,250) ఈపీఎస్ కు  జమ చేస్తారు. ఈపీఎస్ కు వడ్డీని పొందదు. కానీ సభ్యులు 10ఏళ్ల పాటు కంటిన్యూగా కాంట్రిబ్యూట్‌ చేశాక పెన్షన్‌కు అర్హులు అవుతారు  

పీఎఫ్ కు చేసే కాంట్రిబ్యూషన్స్ పై పాతపన్ను విధానంలోని సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు ట్యాక్స్ తగ్గింపు పొందవచ్చు. ఉద్యోగులు చట్టబద్దమైన 12శాతం  కంటే ఎక్కువ  కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ఎంచుకోవచ్చు. ఇందులో ఈపీఎఫ్ మాదిరిగానే వడ్డీ లభిస్తుంది. ఎలాంటి ట్యాక్స్ ఉండదు. కాంట్రిబ్యూషన్స్ ఏడాదికి వచ్చే ఆదాయం రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే..ఆదాయపన్ను పరిధిలోకి వస్తుంది. యజమాని కాంట్రిబ్యూషన్ లేకపోతే ఈ లిమిట్ రూ. 5లక్షలకు పెరుగుతుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link