EPFO Pension: EPS పెన్షన్ దారులకు దీపావళి పండగ ధమాకా అందించిన ప్రధాని మోదీ...పెన్షన్ విషయంలో కీలక నిర్ణయం
EPF pension alert: దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సంబురాలు షురూ అయ్యాయి. చాలా మంది ప్రజలు తమ షాపింగ్ పనుల్లో బిజీగా గడుపుతున్నారు. అయితే ఈ సారి దీపావళి నెలాఖరున రావడంతో వేతన జీవులు, పెన్షన్ దారులు తమ అకౌంట్లోకి డబ్బులు వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.
ఈ సమయంలో ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ పరిధిలో ఉండే పెన్షన్ దారులకు అదిరే న్యూస్ చెప్పింది ఈఫీఎఫ్ఓ. వారందరికీ రెండు రోజులు ముందుగానే పెన్షన్ అందుకోనున్నారు.
అక్టోబర్ 31వ తేదీన దీపావళి వస్తుండటంతో అంతకు ముందుగానే ఈ అక్టోబర్ నెల పెన్షన్ జమ చేయాలని ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సర్య్కూలర్ జారీ చేసింది.
దీపావళి పండగ సంబురాలు, పబ్లిక్ హాలీడేస్ ను ద్రుష్టిలో ఉంచుకుని అక్టోబర్ 2024 నెలకు సంబంధించి పెన్షన్ డబ్బులను ముందుగానే రిలీజ్ చేయాలని డిసైడ్ చేశారు. పెన్షనర్ల అకౌంట్లో అక్టోబర్ 29, 2024 రోజునే జమ చేయనున్నామని..ఎలాంటి ఆలస్యం లేకుండా పెన్షనర్లు అందరూ ముందుగానే తమ పెన్షన్ డబ్బులు అందుకుంటారని..అక్టోబర్ 31వ తేదీన హాలీడే ఉన్నందున వారందరూ కూడా అక్టోబర్ 30వ తేదీన తమ పింఛను డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం లభిస్తుందని ఈపీఎఫ్ఓ తన సర్క్యూలర్ లో పేర్కొంది.
ఈపీఎస్ 95 అనేది ఒక సామాజిక భద్రత పథకం. దీనిని 1995 నవంబర్ లో ప్రారంభించగా..దేశవ్యాప్తంగా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం దీన్ని తీసుకువచ్చారు. ఈ పథకంలో భాగంగా ఉద్యోగులు, యాజమాన్యాలు ఇందులో డబ్బులు జమ చేస్తారు.
ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఉద్యోగి తమ జీతం నుంచి 12శాతం పీఎఫ్ అకౌంట్ కు జమ చేస్తారు. కంపెనీలు అదే మొత్తంలో జమ చేస్తుంటాయి. ఉద్యోగి జమ చేసే మొత్తం పీఎఫ్ అకౌంట్ కు వెళ్తుంది. అదే కంపెనీలు జమ చేసే 12శాతంలో 8.33శాతం ఈపీఎస్ పెన్షన్ పథకంకు వెళ్తుంది.
మిగిలిన 3.67శాతం పీఎఫ్ ఖాతాలోకి జమ అవుతుంది. ఉద్యోగి 58సంవత్సరాల వయస్సులో రిటైర్మెంట్ చేసిన తర్వాత నెల నెలా పెన్షన్ రూపంలో అందిస్తారు.