EPF Money Interesting Facts: ఈపీఎఫ్ ఫండ్‌ని బ్యాంకులు, కోర్టులు అప్పుల కింద అటాచ్ చేయొచ్చా? చట్టం ఏం చెబుతోంది?
Interesting Facts About Your EPF Money: తమ అప్పులను రికవరీ చేసేందుకు బ్యాంకులు కానీ లేదా ఏవైనా క్రెడిట్ సొసైటీలు కోర్టులను ఆశ్రయిస్తే అప్పుడు తమ పరిస్థితి ఏంటనే అభద్రతా భావంలోంచి వచ్చేవే ఈ సందేహాలు అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
Legal Protection Against Your EPF Money: ఈపీఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈపీఎఫ్ చట్టం 1952 లోని సెక్షన్ 10 ప్రకారం ఈపీఎఫ్ ఖాతాలో జమ అయిన మొత్తానికి చట్టబద్ధంగానే లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది.
EPF Money Vs Debts and Liabilities: ఇంకా చెప్పాలంటే.. ఒక వ్యక్తి చేసిన అప్పును తిరిగి రికవరీ చేసే ప్రయత్నంలో భాగంగా అతడు లేదా ఆమె ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న సొమ్మును ముట్టుకోవడానికి ఏ కోర్టుకు కూడా ఎలాంటి అధికారం, హక్కులు లేవని ఈపీఎఫ్ చట్టంలోని సెక్షన్ 10 చెబుతోంది.
What Happens If a EPF Account Holder Dies in This case : అంతేకాకుండా.. ఒకవేళ ఈపీఎఫ్ ఖాతాదారుడు చనిపోయినట్టయితే.. వారి అప్పులకు కానీ లేదా వారి నామిని చేసిన అప్పుల కింద కానీ ఈపీఎఫ్ మొత్తాన్ని అటాచ్ చేయడానికి వీల్లేదని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ స్పష్టంచేస్తోంది.
Employer Vs Employee in EPF Money: ఒకవేళ ఒక ఉద్యోగి లేదా ఉద్యోగిని నుంచి వారు ఉద్యోగం చేస్తోన్న కంపెనీ ఏదైనా డ్యూస్ రికవరీ చేసుకోవాల్సి వస్తే.. సదరు ఉద్యోగులకు చెల్లించాల్సిన ఈపీఎఫ్ మొత్తంలోంచి ఆ డ్యూస్ మొత్తాన్ని మినహాయించుకునేందుకు సైతం ఎంప్లాయర్‌కి అవకాశం లేదు.