PF Balance Check: UAN నంబర్ లేకున్నా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎలాగో తెలుసా.. ఈ సింపుల్ స్టెప్స్ మీ కోసం..!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అనే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సేవింగ్స్ స్కీమ్. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా.. దీర్ఘకాలంలో డబ్బు ఆదా చేసుకునేందుకు ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది.
ప్రతి నెలా ఉద్యోగి జీతంలో 12 శాతం పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. కంపెనీ కూడా 12 శాతం చెల్లిస్తుంది. వీటికి ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది. ప్రస్తుతం 8.25 శాతం వడ్డీని అందజేస్తోంది.
అయితే కొన్ని కంపెనీలు ఈపీఎఫ్‌కు డబ్బులు జమ చేయట్లేదని ఇటీవల ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. మరి మీ కంపెనీ కూడా డబ్బులు జమ చేస్తుందా..? మీ పీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు ఎంత ఉన్నాయో సింపుల్‌గా తెలుసుకోండి.
ఆన్‌లైన్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు EPFO మెంబర్ పాస్‌బుక్ పోర్టల్‌లో UAN నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
లాగిన్ అయిన తరువాత స్క్రీన్‌పై మీ బ్యాలెన్స్ వివరాలు ప్రత్యక్షం అవుతాయి. మీరు చెక్ చేసుకోవాలనుకుంటున్న PF అకౌంట్‌ను ఎంచుకుని దానిపై క్లిక్ చేసి చెక్ చేసుకోండి.
SMS ద్వారా కూడా PF బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరు నుంచి UAN 12 అంకెలు, EPFOHO UANతో 7738299899కి SMS పంపాలి. మీ నంబరుకు బ్యాలెన్స్ మెసేజ్ రూపంలో వస్తుంది.
UMANG యాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవచ్చు. ముందుగా UMANG యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత ఈపీఎఫ్‌ఓ విభాగం ఎంచుకోండి. మీ UAN నంబర్ సహాయంతో పోర్టల్‌కి లాగిన్ అవ్వండి. ఇక్కడ PF బ్యాలెన్స్, అకౌంట్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
UAN నంబర్ లేకుండా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరు నుంచి 9966044425 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలి. 2 రింగ్‌ల తర్వాత ఆటోమేటిక్‌గా కాల్ కట్ అవుతుంది. పీఎఫ్ బ్యాలెన్స్ సమాచారం మీ నంబరుకు మెసేజ్ రూపంలో వస్తుంది.