EPFO Pension Rules: పీఎఫ్‌ ఖాతారులు తప్పకుండా తెలుసుకోండి.. ఎన్ని రకాల పెన్షన్లు ఉన్నాయో తెలుసా..!

Fri, 30 Aug 2024-1:01 pm,

ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం పెన్షన్ రూపంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) చందాదారులు 58 సంవత్సరాల తరువాత పెన్షన్‌కు అర్హత ఉంటుంది.  

పీఎఫ్‌ ఖాతాదారులు 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సర్వీస్‌ను పూర్తి చేసి ఉంటే.. 58 సంవత్సరాల వయస్సు నిండిన తరువాత పెన్షన్ అందుకుంటారు.  

ఒక ఈపీఎఫ్‌ సభ్యుడు 50 ఏళ్లు పైబడి 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి.. ఆ తరువాత ఈపీఎఫ్‌ లేని కంపెనీలో చేరినా అతను పెన్షన్ పొందుతాడు. అయితే ఈ పెన్షన్ 58 ఏళ్ల పదవీ విరమణ వయస్సుతో పోలిస్తే ప్రతి సంవత్సరం 4 శాతం తక్కువగా ఉంటుంది.   

ఉదాహరణకు ఓ వ్యక్తి 58 సంవత్సరాల వయస్సులో నెలవారీ రూ.10 వేల పెన్షన్‌కు అర్హత ఉంటే.. అతను 57 సంవత్సరాల వయస్సులో రూ.9,600, 56 సంవత్సరాల వయస్సులో రూ.9,200 పెన్షన్ అందుకుంటారు.  

పీఎఫ్‌ ఖాతాదారుడు ప్రమాదవశాత్తు వైకల్యానికి గురైతే (శాశ్వత లేదా తాత్కాలిక) పెన్షన్‌కు పొందేందుకు అర్హులు. ఈ పెన్షన్‌ కోసం 10 ఏళ్ల సర్వీసు లేదా కనీస వయస్సు 50 ఏళ్లు పూర్తి చేయాల్సిన అవసరం లేదు. ఒక నెల ఈపీఎఫ్‌ఓకు కంట్రిబ్యూట్ చేసినా కూడా పెన్షన్ అందుకుంటారు.   

ఒకవేళ పీఎఫ్‌ చందాదారుడు మరణిస్తే.. సభ్యుడి జీవిత భాగస్వామికి ఆర్థిక సహాయాన్ని ఈపీఎఫ్‌ఓ నిర్ధారిస్తుంది. జీవిత భాగస్వామికి నెలవారీ పెన్షన్‌ను అందిస్తుంది. EPS 95 కింద చైల్డ్ పెన్షన్ మరణించిన EPFO ​​సభ్యుడి ఇద్దరు పిల్లలకు ఏకకాలంలో ఆర్థిక సహాయం అందిస్తుంది. పిల్లలకు 25 ఏళ్లు వచ్చే వరకు నెలవారీ పెన్షన్‌ అందుకుంటారు. పెళ్లికాకపోతే.. తండ్రికి పెన్షన్ ఇస్తారు.  

మరణించిన సభ్యుడి భార్య అప్పటికే మరణించి ఉంటే.. సభ్యుడి పిల్లలకు ఆర్థిక సహాయం అందిస్తారు. నెలవారీ పెన్షన్ మొత్తం చెల్లిస్తారు.   

ఈపీఎఫ్‌ఓ సభ్యుడికి ఎవరూ లేకపోతే.. నామినీగా పేరు ఇచ్చిన వారికి పెన్షన్ అందుతుంది. ఈపీఎఫ్‌ సభ్యులు, వారి కుటుంబాలకు సమగ్రమైన సామాజిక భద్రతా కవరేజీని అందించేందుకు ఈపీఎఫ్‌ఓ అన్ని చర్యలు చేపట్టింది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link