EPFO Pension: 15 కోట్ల ప్రైవేటు ఉద్యోగులకు తిపి కబురు.. కేంద్రం నుంచి నేరుగా వారి ఖాతాల్లోకి రూ.10 వేలు పెన్షన్‌!

Sat, 09 Nov 2024-10:41 am,

EPFO ఖాతా దారులు భారీ ప్రయోజనాలు పొందేందుకు కేంద్రం త్వరలోనే ప్రైవేటు ఉద్యోగులకు సంబంధించిన జీతాలకు పెంపునకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించనుంది. దీని వల్ల పదవి విరమణ పొందిన తర్వత పెన్షన్‌కు సంబంధించిన ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. 

ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే యూనివర్సల్ పెన్షన్ సిస్టం  ద్వారా పెన్షన్‌కి సంబంధించిన అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. అయితే ప్రైవేటు ఉద్యోగులను కూడా ఇదే సిస్టం కిందికి తీసుకు రావాలని కేంద్ర యోచిస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై కేబినెట్‌లో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. 

ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగుల జీతాలను కూడా పెంచేందుకు యోచిస్తే.. ఇదే సమయంలో PF కాంట్రిబ్యూషన్‌ శాతం కూడా భారీ మొత్తంలో పెరిగే ఛాన్స్‌ ఉంది. దీని వల్ల భారీ మొత్తం ఫీఎఫ్ ఖాతాలు డబ్బులు చేరుతాయి. 

ఇక కేంద్రం ఇదే పని కనుక చేస్తే ప్రైవేటు ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు సరిసమానం పదవి విరమణ తర్వాత పెన్షన్‌ లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇక ఈ PF కాంట్రిబ్యూషన్‌కి సంబంధించిన ప్రకటన త్వరలోనే చేసే అవకాశాలు ఉన్నాయి.  

కార్మిక శాఖ ఇదే అంశంపై ప్రత్యేకమైన ప్రపోజల్‌ను కూడా రెడీ చేసి డాక్యుమెంట్‌ రూపంలో ఆర్థిక శాఖకు అందించబోతున్నట్లు సమాచారం. అయితే దీనిని ఆర్థిక శాఖ అమోదించిన వెంటనే ప్రైవేటు ఉద్యోగుల జీతాలు పెరగడమే కాకుండా PFకి సంబంధించిన కట్టింగ్స్‌ కూడా విపరీతంగా పెరుగుతాయి. 

ఈ ప్రపోజల్‌లో పేర్కొన్న కొన్ని వివరాలు పరిశిలిస్తే.. EPFకి సంబంధించిన వేతన పరిమితిని దాదాపు రూ.21 వేలకు పైగానే పెంచమని కార్మిక మంత్రిత్వ శాఖ ప్రపోజల్ చేసినట్లు తెలుస్తోంది. దీనిని కేంద్రం ఆమోదిస్తే ప్రతి ఉద్యోగి జీతం ఊహించని స్థాయిలో పెరుగుతుంది.   

జీతాలు పెరగడం వల్ల PF భారీ మొత్తం పెరుగుతుంది. దీని కారణంగా రిటైర్మెంట్ తర్వాత ప్రైవేటు ఉద్యోగులు కూడా దాదాపు నెలకు రూ.10 వేల పైనే పెన్షన్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది జీవితకాలం పెన్షన్‌గా కూడా మారుతుంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link