Farmers Tractor Rally: బారీకేడ్లను విచ్ఛిన్నం చేసుకుంటూ ఢిల్లీలో ముందుకు సాగుతున్న రైతులు

Tue, 26 Jan 2021-11:08 am,

Farmers Tractor Rally: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు గత కొన్ని రోజులుగా నిరసన (Farmers Protest Latest Update) తెలుపుతున్నారు. నేడు దేశ రాజధాని ఢిల్లీలో రైతులు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇదివరకే ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి ట్రాక్టర్లు చేరుకుంటున్నాయి. (Photo: Twitter/ANI)

Also Read: Republic Day 2021 Wishes, Quotes: 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇలా తెలపండి

సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌ సరిహద్దుల్లో భారీగా ట్రాక్టర్ల ర్యాలీ(Farmers Tractor Rally)లో పాల్గొంటున్నాయి. ఆయా మార్గాల్లో ప్రభుత్వం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. సింఘు, టిక్రీ సరిహద్దుల్లో పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను రైతులు విచ్ఛిన్నం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. (Photo: Twitter/ANI)

Also Read: Republic Day 2021: 72వ రిపబ్లిక్ డే.. 5 ముఖ్యమైన విషయాలు

వాస్తవానికి రాజ్‌పథ్‌లో రిపబ్లిక్ డే వేడుకలు ముగిసిన వెంటనే సరిహద్దుల నుంచి ఢిల్లీలోకి రైతన్నల ట్రాక్టర్లు చేరుకోవాల్సి ఉంది. అయితే అంతకుముందుగానే అన్నదాతలు బారికేడ్లను దాటుకుంటూ ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభించారు. (Photo: Twitter/ANI)

రైతుల భారీ ట్రాక్టర్ ర్యాలీ నేపథ్యంలో అయిదు అంచల భద్రతా వ్యవస్థను ఢిల్లీలో ఏర్పాటు చేశారు. భద్రతా కోసం 6వేల మందికిపైగా సిబ్బందిని ఢిల్లీలో మోహరించారు. ముఖకవళికలను గుర్తించే అత్యాధునిక పరికరాలనూ పోలీసులు అమర్చారు. (Photo: Twitter/ANI)

Also Read: Patriotic Songs: దేశభక్తిని కళ్లకు కట్టినట్లు చూపించే Republic Day Songs

మరోవైపు దేశ వ్యాప్తంగా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న నేడు తమ సమస్యను ప్రశాంతంగా తెలిపేందుకు రెండు లక్షలకుపైగా ట్రాక్టర్లతో రైతుల కవాతు ప్రారంభమవుతుందని కిసాన్‌ మోర్చా నేతలు తెలిపారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link