Filmfare Awards 2024: ఫిలింఫేర్ ఓటీటీ అవార్డ్స్ 2024.. ఉత్తమ నటి ఎవరంటే..!
తాజాగా ఫిలింఫేర్ ఓటీటీ అవార్డ్స్ 2024 విజేతల జాబితాను విడుదల చేయగా.. జానే జాన్ అనే చిత్రానికి గానూ ఉత్తమ నటిగా కరీనాకపూర్ అవార్డును సొంతం చేసుకున్నారు. మరొకవైపు అమర్ సింగ్ చమ్కీల సినిమా కోసం దిల్జిత్ దోసాంజ్ ఉత్తమ నటుడు.. కేటగిరీలో అవార్డును అందుకోవడం జరిగింది.
ఇకపోతే సినిమాలు, వెబ్ సిరీస్ లకు సంబంధించిన నటీనటులు అలాగే ఇతర సభ్యులు వారి ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు రివార్డులు అందుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఫిలింఫేర్ ఓటిటి అవార్డ్స్ 2024 డిజిటల్ కంటెంట్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన చిత్రాలకు అందులో నటించిన నటీనటులకు అవార్డులు ప్రకటించడం జరిగింది. వెబ్ ఒరిజినల్ ఫిలిం జానీ జాన్ లో కరీనాకపూర్ ఖాన్ కు ఉత్తమ నటిగా అవార్డు లభించింది. ఇతర ప్రముఖ విజేతలలో హీరామండి, డైమండ్ బజార్ ఉత్తమ సిరీస్ క్యాటగిరిలలో అవార్డులు అందుకున్నాయి.
ఇకపోతే ఉత్తమ నటుడు క్యాటగిరీలో కరీనాకపూర్ అవార్డు అందుకోవడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబవుతూ..మనస్ఫూర్తిగా అవార్డును ఆమె ముద్దాడిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం ఈ విషయం తెలిసి.. పలువురు సెలబ్రిటీలు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక కరీనాకపూర్ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.