Financial Tips: సెప్టెంబర్ 30వ తేదీలోపు పూర్తి చేయాల్సిన పనులు ఇవే..!
ఆర్బీఐ రూ.2000 నోటును విత్ డ్రా చేసుకుంది. బ్యాంకులలో డిపాజిట్ చేసుకునేందుకు ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. సెప్టెంబర్ చివరి నాటికి తమ వద్ద ఉన్న 2000 రూపాయల నోటును డిపాజిట్ చేయాలి లేదా బ్యాంకు నుంచి మార్చుకోవాల్సి ఉంటుంది.
సీనియర్ సిటిజన్ల కోసం ఎస్‌బీఐ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. SBI WeCare స్పెషల్ ఎఫ్‌డీ పథక ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసం ప్రవేశపెట్టింది ఎస్‌బీఐ. ఈ స్కీమ్ కింద 7.5 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
ఐడీబీఐ అమృత్ మహోత్సవ్ ఎఫ్‌డీ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేందుకు సెప్టెంబర్ 30న చివరి తేదీ. 375 రోజుల ఈ ఎఫ్‌డీ స్కీమ్‌లో సాధారణ వినియోగదారులకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. 444 రోజుల ఎఫ్‌డీ కింద సాధారణ వినియోగదారులకు 7.15 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 7.65 శాతం వడ్డీని అందజేస్తోంది.
డీమ్యాట్, మ్యూచువల్ ఫండ్‌లలో నామినీ వివరాలను అందించడం చాలా ముఖ్యం. నామినీని సూచించడానికి లేదా నామినీని నిలిపివేయడానికి ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాదారులు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు సెబీ ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది.