FirstCry IPO: నేటి నుంచి ఫస్ట్ క్రై ఐపీవో ప్రారంభం..మినిమం ఎన్ని షేర్లకు బిడ్ దాఖలు చేయాలి..ఎంత ఇన్వెస్ట్ చేయాలి?
FirstCry IPO Subscription : పిల్లలకు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసే బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్ వారి ఫస్ట్ క్రై ఐపీఓ బిడ్డింగ్ కోసం తెరుచుకుంది. ఇప్పటికే దేశంలోనే ఈ విభాగంలో మంచి బిజినెస్ కలిగి ఉన్న ఫస్ట్ క్రైలో ఇన్వెస్ట్ చేసేందుకు మదుపుదారులు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో మీరు కూడా ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే విషయాలను జీ బిజినెస్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింఘ్వి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ ఐపీఓ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
మీరు ప్రైమరీ మార్కెట్లో ఐపీఓ ద్వారా ప్రవేశించాలి అనుకున్నట్లయితే ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక దృష్టితో ఫస్ట్ క్రై ఐపీఓలో సబ్ స్క్రిప్షన్ తీసుకోవచ్చని జీ బిజినెస్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింఘ్వీ తెలిపారు. అనిల్ సింఘ్వీ వ్యూ ప్రకారం ఈ ఐపీవోపై ఆయన "దీర్ఘకాలిక దృక్పథంతో దరఖాస్తు చేసుకోవాలని సూచన చేశారు.
ఫస్ట్ క్రై ఐపీవోలో ఉన్న అనుకూలతలు ఇవే : కంపెనీ బాధ్యతలు అనుభవం ఉన్న మేనేజ్ మెంట్ చేతుల్లో ఉన్నాయని సంఘ్వీ సూచన చేశారు. ముఖ్యంగా పిల్లల ఉత్పత్తుల కోసం మల్టీ-ఛానల్, మల్టీ బ్రాండ్ రిటైలింగ్ రంగంలో ఈ సంస్థ మార్కెట్ లీడర్ గా ఉంది. సొంత బ్రాండ్‌లను కలిగి ఉండటంతో పాటు, దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో షాపింగ్ చైన్ కలిగి ఉంది. అలాగే ఆన్ లైన్ ద్వారా కూడా మంచి సేల్స్ అందుకుంటోంది.
ఫస్ట్ క్రై ఐపీవో నెగిటివ్ లు ఇవే: గత మూడు సంవత్సరాలుగా కంపెనీ నెగిటివ్ ఇన్ ఫ్లో కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. కంపెనీ ఇప్పటికీ కూడా నికరంగా నష్టాల రికవరీ లోనే ఉంది. కానీ వ్యాపార పరంగా మాత్రం కంపెనీకి మంచి భవిష్యత్తు ఉంది. కొత్త సెగ్మెంట్లలో పెట్టుబడి లు పెట్టేందుకు కంపెనీకి నగదు అవసరం అవుతోంది.
సబ్‌స్క్రిప్షన్ తేదీలు, ప్రైజ్ బ్యాండ్లు ఇవే: ఫస్ట్ క్రై IPO ఇప్పుడు పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుచుకుంది. ఆగస్ట్ 8న బిడ్డింగ్ ముగుస్తుంది. బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఫస్ట్‌క్రై IPO ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో ఈక్విటీ షేర్‌కి కనిష్టంగా రూ. 440 నుండి గిరిష్టంగా రూ. 465గా నిర్ణయించారు. బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ లాట్ సైజు 32 ఈక్విటీ షేర్లుగా నిర్ణయంచారు.మినిమం రూ.14080 వరకూ ఇన్వస్ట్ చేయవచ్చు.
ఇష్యూ సైజు ఇదే: లింక్ ఇన్‌టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధికారిక రిజిస్ట్రార్‌గా నియమించారు. ఫస్ట్ క్రై బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూ పరిమాణం రూ.4,194 కోట్లకు చేరుకుంది. సాఫ్ట్‌బ్యాంక్ 25.55% వాటాను కలిగి ఉంది M&M మల్టీ-బ్రాండ్ రిటైలింగ్ ప్లాట్‌ఫామ్‌లో 10.98 శాతం వాటాను కలిగి ఉంది. PI ఆపర్చునిటీస్ ఫండ్, TPG, న్యూక్వెస్ట్ ఆసియా ఇన్వెస్ట్‌మెంట్స్, ఆప్రికాట్ ఇన్వెస్ట్‌మెంట్స్, ష్రోడర్స్ క్యాపిటల్‌లు OFSలో ఇతర అమ్మకపు షేర్లు. అలాగే కంపెనీ వాటాదారుల్లో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కూడా విశేషం.
బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్ లు వీరే: కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ లిమిటెడ్, మోర్గాన్ స్టాన్లీ ఇండియా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, బోఫా సెక్యూరిటీస్ ఇండియా లిమిటెడ్, JM ఫైనాన్షియల్ లిమిటెడ్ , అవెండస్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇష్యూకి బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్‌లుగా వ్యవహరిస్తున్నారు.