గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహార పదార్థాలు
మన శరీరంలో గుండె అతి ముఖ్యమైన భాగం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఆ ఆహార పదార్థాలు ఇవే..
గుడ్లలో ప్రోటీన్ లు ఎక్కువగా ఉంటాయని మాత్రమే మనకు తెలుసు.. కానీ గుడ్లలో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్ లు కూడా అధికంగా ఉంటాయి. రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ లో ఉడకబెట్టిన గుడ్లను తింటే మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
చేపలతో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్ పుష్కలంగా ఉంటాయన్న సంగతి మన అందరికి తెలిసిందే. దీంతో పాటుగా విటమిన్ B5, మెగ్నీషియం, ప్రొటీన్లు, పొటాషియం వంటి మూలకాలు కూడా శరీరానికి అందిస్తాయి. సాల్మన్ ఫిష్ లో ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి.
అవిసె గింజలే అని తీసిపారేయకండి. వీటిలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ అధిక మొత్తంలో ఉంటాయి. అంతేకాకుండా వీటిలో మెగ్నీషియం, విటమిన్ C వంటి పోషకాలను కూడా ఉంటాయి.
సోయాబీన్ లో ప్రోటీన్ మాత్రమే కాకుండా.. ఒమేగా -3 మరియు ఒమేగా -6 ఫాటీ ఆసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినటం వలన శరీరానికి ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం మరియు ఫోలేట్ వంటి పోషకాలు కూడా అందుతాయి.