Woolly Rhino: 40 వేల ఏళ్లనాటి రైనో మృతదేహం..చెక్కుచెదరకుండా..ఇదే రహస్యం
ఈ రైనో ( Rhino ) శరీరంలోని అత్యధిక భాగాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ రైనో మరణానికి కారణాల్ని శోధించడంలో నిమగ్నమయ్యారు. దాంతోపాటు రైనో ఆడా..మగా అనేది పరిశీలిస్తున్నారు. నదిలో మునగడం వల్లనే ఈ రైనో చనిపోయుంటుందని డాక్టర్ అల్బర్ట్ ప్రోతోపోవ్ కచ్చితంగా చెబుతున్నారు.
పెద్ద పెద్ద వెంట్రుకలున్న రైనో జాతి యూరప్, సైబీరియా, చైనా, దక్షిణ కొరియాలో ఉండేది. ఈ అన్నిదేశాల్లోనూ ఈ రైనో అవశేషాలు లభించాయి. సైబీరియాలో లభించిన రైనో పొడుగు 8 అడుగులు కాగా..ఎత్తు నాలుగున్నర అడుగులుంది. ఈ రైనో చనిపోయే సమయానికి దాని వయస్సు 3-4 ఏళ్లుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
దాదాపుగా 40 వేల ఏళ్లనాటిదని శాస్త్రవేత్తలు పరిశోధించి చెప్పారు. ఈ రైనో ( Rhino ) పై మౌంటెయిన్ లయన్ ( Mountain Lion ) దాడి చేసిందని..దాన్నించి తప్పించుకునేందుకు రైనో మంచు బురదలో చిక్కుకు పోయిందని..తరువాత నదిలో కొట్టుకువచ్చి ఇక్కడికి చేరిందని చెబుతున్నారు. దాడి చేసినట్టు చెబుతున్న మౌంటెయిన్ లయన్ జాతి కూడా ఇప్పుడు అంతరించిపోయింది.
సైబీరియా ( Siberia ) లో యాకుతియా ( Yakutia ) అనే ఓ ప్రాంతముంది. ఇక్కడ మంచు కరగడంతో ఓ జంతువు మృతదేహం బయటపడింది. అది చూసి స్థానికులు నిర్ఘాంతపోయారు. వెంటనే పురావస్తు శాస్త్రవేత్తలకు సమాచారం అందించారు. పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడికి చేరుకుని..మంచులో కూరుకుపోయున్న రైనో ( Rhino ) ని చూసి ఆశ్చర్యపోయారు. వేల ఏళ్ల తరువాత కూడా ఆ రైనోలోని కొన్ని శరీర భాగాలు ఇంకా చెక్కుచెదరకుండా ఉన్నాయి.