Friendship day 2024: తెలుగులో స్నేహంపై వచ్చిన అలనాటి మేటి చిత్రాలు ఇవే.. పార్ట్ 1
ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు నెలలో వచ్చే మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగులో తెరకెక్కిన అలనాటి చిత్రాలు చాలానే ఉన్నాయి. అందులో కొన్ని అద్భుత చిత్రాలు మీ కోసం..
మంచి మిత్రులు: సూపర్ కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా వి.మధుసూదన రావు తెరకెక్కించిన సినిమా ఫ్రెండ్ షిప్ కు కొత్త అర్ధాన్ని చెప్పింది.
చిన్ననాటి స్నేహితులు: పేరులోనే ఈ సినిమా స్నేహాన్ని చూపిస్తోంది. ఎన్టీఆర్, జగ్గయ్యలు నటించిన ఈ సినిమా స్నేహానికి కొత్త అర్ధాన్ని చెప్పింది.
ప్రాణ మిత్రులు: స్నేహం విలువను చాటి చెప్పిన చిత్రాల్లో ప్రాణ మిత్రులు కూడా ఒకటి. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్యలు స్నేహితులుగా నటించారు.
ముగ్గురు మిత్రులు: శోభన్ బాబు, చంద్ర మోహన్, మురళీ మోహన్ హీరోలుగా నటించిన ‘ముగ్గురు మిత్రులు’ సినిమా కూడా మంచి స్నేహ చిత్రంగా నిలిచింది.
నిప్పులాంటి మనిషి: ఎన్టీఆర్, సత్యనారాయణ బద్ధ శత్రువుల నుంచి ప్రాణ స్నేహితులుగా ఎలా మారారనే నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘నిప్పులాంటి మనిషి’. ఈ సినిమా తెలుగులో అత్యుత్తమ స్నేహ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
ప్రాణ స్నేహితులు: రెబల్ స్టార్ కృష్ణంరాజు, శరత్ బాబు హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా అత్యుత్తమ స్నేహ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.