Gajakesari Yogam: 2025లో గజకేసరి యోగంతో 5 రాశుల వారికీ వివాహా యోగం.. నట్టింట్లో కనక వర్షం..
Gajakesari Yogam: గజకేసరి యోగం వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో చూద్దాం. మే నెలలో 2025లో దేవగురువు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది. దీని వల్ల అద్భుతమైన గజకేసరి యోగం ఏర్పడబోతుంది. దీని వల్ల కొన్ని రాశుల వారికీ అనుకోని ధనయోగం కలగబోతుంది.
కన్య రాశి: బృహస్పతి, చంద్రుడి కలయిక వల్ల ఏర్పడిన గజకేసరి యోగం వలన సంతానం లేని దంపతులకు వచ్చే యేడాది పిల్లలు పుట్టే అవకాశం ఉంది. వ్యాపారంలో అనుకోని లాభాలను గడిస్తారు. అవాహితులకు వివాహాం తప్పకుండా అవుతోంది. ఆర్థికంగ నిలదొక్కుకుంటారు.
మిథున రాశి.. చంద్రుడు, బృహస్పతి కలయిక వల్ల మిథున రాశి వారికి లాభాలు అందుకుంటారు. కెరీర్ లో ఆశించిన ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో ఎక్కువ లాభాలను అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది.
తుల రాశి.. కెరీర్ లో ఎదుగుల ఉంటుంది. గజకేసరి యోగం వల్ల ఆధ్యాత్మికత ఉట్టి పడుతుంది. కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. కుటుంబం, స్నేహితులతో మంచి టైమ్ గడిపే అవకాశం ఉంది. మీ పనిని పై అధికారులు మెచ్చుకుంటారు.
సింహ రాశి.. సింహ రాశి వారికీ గజకేసరి యోగం వల్ల పూర్వీకులు ఆస్తులు పొందుతారు. ఆర్ధికంగా పుంజుకుంటారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలు స్వీకరిస్తారు. వ్యాపారంలో సంపూర్ణమైన లాభాలను అందుకుంటారు.
కుంభ రాశి..
కుంభ రాశి వారికి గజకేసరి యోగం వలన గత కొంత కాలంగా అనుభవిస్తున్న కష్టాలు తొలిగిపోతాయి. కెరీర్ లో పురోగతి పొందుతారు. వాహన యోగం అందుకుంటారు. వాహన సుఖం అందుకుంటారు. ఆర్ధికంగా లాభాలను అందుకుంటారు. వారు తమ కలలను నెరవేర్చుకోగలరు.
గమనిక: ఈ కథనం మతపరమైన ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. జీ న్యూస్ ఈ విషయాన్ని ధృవీకరించలేదు.