Ganesh Chaturthi 2024: వినాయకుడి జీవితం నుంచి మనం నేర్చుకొవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..

Sun, 08 Sep 2024-6:13 pm,

వినాయకుడు..అంటే విఘ్నాలు, ఆటంకాలను తొలగించేవాడు. మనం ప్రారంభించిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకెళ్తుంటాడు. అందుకే గణాధిపత్యం కూడా ఆయనకే ఇచ్చారు. వినాయకుడి జీవితం నుంచి మనం  5 ముఖ్యమైన విషయాలను ప్రేరణగా తీసుకుని వాటిని మనం మన నిత్య జీవితంలో పాటించవచ్చు. 

1. విధి నిర్వహణే పరమావధి.. పార్వతి గణేషుడి బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసింది. స్నానానికి వెళ్తున్నాని,లోనికి ఎవర్ని రానివ్వొద్దని చెప్పింది. అప్పుడు శివయ్య.. అక్కడికి వస్తాడు. కానీ బాలగణేషుడు అడ్డగిస్తాడు.దీంతో ఇద్దరి మధ్య యుద్దం జరుగుతుంది. ప్రాణాలు పోయిన సరే.. విధి నిర్వహణ మాత్రం గజననుడు విధిగా ఆచరిస్తాడు. నిజంగా మనం కూడా అలవాటు చేసుకుంటే లక్ష్యసాధనలో, కెరీర్‌లో మనం దూసుకెళ్లవచ్చు.

2. తల్లిదండ్రుల కన్నా ఎవరూ ఎక్కువ కాదు..  గణేషుడు, కుమారస్వామిలలో ఎవరిని గణాధిపతిగా చేయాలని ఆలోచిస్తూ శివపార్వతులు వారికి ఒక పరీక్ష పెడతారు. వారిద్దరిలో ఎవరు ముందుగా ముల్లోకాల్లో ఉన్న పుణ్య క్షేత్రాలను చుట్టి వస్తారో వారికే అగ్రతాంబులం ఇస్తామంటారు. కుమార స్వామి నేమల వాహానం మీద ముల్లోకాలు చుట్టేస్తుంటాడు. కానీ గజననుడు మాత్రం.. ముల్లోకాలు అన్ని తల్లిదండ్రుల్లోనే ఉంటాయని, శివపార్వతులకు  3 ప్రదక్షిణలు చేసి గణాధిపతి అవుతాడు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను దైవంగా భావించి జాగ్రత్తగా చూసుకోవాలనే విషయాన్ని మనకు గణేషుడి జీవితంలో జరిగిన ఈ సంఘటన చెబుతుంది.  

3. తప్పుచేసిన వారిని క్షమించడం .. వినాయకుడు ఒకసారి సుష్టుగా భోజనం చేసి ఆపసోపాలు పడుతూ వెళ్తుంటే అతన్ని చూసి చంద్రుడు నవ్వుతాడు. కైలాసంలో శివపార్వతులకు దండం పెట్టేందుకు కిందకు వంగుతాడు. అప్పుడు శివుడి శిరస్సు మీద ఉన్న చంద్రుడు నవ్వుతాడు. అప్పుడు పార్వతి కోపంతోచంద్రుడ్రి శపిస్తుంది. వెంటనే చంద్రుడు.. తప్పు తెలుసుకొని పరిహారం కోరగా.. కేవలం ఒక్కరోజు గణేష్ చతుర్థి రోజు చంద్రుడ్ని చూడొదని చెప్తుంది. అలా ఎవరు ఏ తప్పు చేసినా క్షమించమని మనకు వినాయకుడి జీవితం చెబుతుంది.

4. చేపట్టిన పనిని వెంటనే పూర్తిచేయడం ..వేద వ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని వినాయకుడు తాళపత్ర గ్రంథాలపై రాశాడన్న సంగతి తెలిసిందే. అయితే తాను ఆ పురాణం మొత్తాన్ని చెప్పడం పూర్తి చేసే వరకు మధ్యలో ఆగకూడదని వ్యాసుడు చెబుతాడు. దీంతో వినాయకుడు మధ్యలో కనీసం విశ్రాంతి అయినా లేకుండా.. నిరంతరాయంగా అలా మహాభారత గ్రంథాన్ని వ్యాసుడు చెప్పింది చెప్పినట్లుగా రాస్తూనే ఉంటాడు. ఓ దశలో గ్రంథం రాసేందుకు ఉపయోగించే ఘంటం (పెన్ను లాంటిది) విరిగిపోయిన,గణేషుడు తన దంతాల్లోంచి ఒక దాన్ని విరిచి గ్రంథం రాయడం పూర్తి చేస్తాడు. కానీ మధ్యలో ఆగడు. దీన్ని బట్టి మనకు తెలుస్తుందేమిటంటే.. ఏ పనిచేపట్టినా, ఎన్ని అవరోధాలు వచ్చినా వెంటనే ఆ పనిని పూర్తి చేయాలి. మధ్యలో ఆగకూడదన్నమాట..!   

5. ఆత్మ గౌరవం .. ఒకసారి శ్రీమహావిష్ణువు ఇంట్లో జరిగే శుభ కార్యానికి దేవతలందరూ వెళ్తారు. స్వర్గలోకానికి గణేషున్ని కాపలా ఉంచి అందరూ వెళ్తారు. అయితే వినాయకుడి ఆకారం తమకు నచ్చనందునే ఆయన్ను అక్కడ ఉంచి వారు వెళ్లిపోయారన్న సంగతి గణేషుడికి తెలుస్తుంది. దీంతో దేవతలకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలనుకున్న గణేషుడు వారు వెళ్లే దారిలో అన్నీ గుంతలు ఏర్పడేలా చేయమని మూషికాన్ని ఆదేశిస్తాడు. మూషికం దేవతలు వెళ్లే దారినంతా తవ్వి గుంతలమయంగా చేస్తుంది. దీంతో ఆ దారిలో వెళ్తున్న దేవతల రథం ఒకటి ఒక గుంతలో దిగబడుతుంది. వారు ఎంత ప్రయత్నించినా ఆ రథాన్ని బయటకు లాగలేకపోతారు. అటుగా వెళ్తున్న ఓ రైతును పిలిచి సహాయం చేయమంటారు. అతను వచ్చి గణేషున్ని ప్రార్థించి ఒక్క ఉదుటున గుంతలో దిగబడి ఉన్న రథాన్ని బయటకు లాగుతాడు. దాంతో దేవతలు ఆశ్చర్యపోతారు. 

వినాయకుడు అన్ని అవరోధాలను తొలగించే దైవం కనుక ఆయన్ను ప్రార్థించి రథాన్ని లాగానని రైతు చెప్పగానే దేవతలు సిగ్గుతో తలదించుకుంటారు. వారు చేసిన తప్పు వారికి అర్థమవుతుంది. దీంతో వినాయకుడి వద్దకు వెళ్లి క్షమాపణలు కోరతారు.  ఏ పరిస్థితిలోనైనా ఆత్మ గౌరవాన్ని మనం కోల్పోకూడదని వినాయకుడి జీవితంలో జరిగిన ఆ సంఘటన మనకు ఆ సత్యాన్ని తెలియజేస్తుంది..  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link