Free Bus Scheme: ఏపీ మహిళలు ఎగిరి గంతేసే వార్త.. ఉచిత బస్సు ప్రయాణంకు మూహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన..
ప్రస్తుతం మహిళలకు పలు రాష్ట్రాలలో ఉచిత బస్సు ప్రయాణం పథకంను అమలు చేస్తున్నారు. తెలంగాణ,కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు.. ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో కూటమి.. ఎన్నికల వేళ.. తాము.. అధికారంలోకి వస్తే.. మహిళలకు ఫ్రీబస్సు జర్నీ పథకం అమలు చేస్తామని కూడా హమీ ఇచ్చింది. అయితే.. తాజాగా, ప్రభుత్వ విప్, గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ పథకం అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
ఏపీలో..'సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తొంది.దీనిలో భాగంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కూడా క్లారిటీఇచ్చారు. దీనిపైన మరిన్ని విధివిధానాలు అధ్యయనం చేస్తున్నామన్నారు.
ఏపీ నుంచి ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలకు టీమ్ లను పంపినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఏపీఎస్‌ఆర్టీసీకి నెలకు రూ.260 కోట్ల వరకు భారం పడుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు సమాచారం. మరోవైపు ఏయే బస్సుల్ని..ఈ ఉచిత బస్సు ప్రయాణం కు వర్తింపజేయాలనే దానిపై ప్రస్తుతం అధికారులతో సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తొంది.
అదే విధంగా ఆటో వాళ్లకు కూడా ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చారు. అలాగే కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా లేదా పాత ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉంటుందా? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. రాష్ట్రమంతా ఎక్కడికైనా ప్రయాణానికి అవకాశం ఇస్తారా ..లేదా కొన్ని పరిధులు ఏమైన ఉంటాయా..అనేదానిపై అధికారులు చర్చిస్తున్నట్లు తెలుస్తొంది.
మరోవైపు పలు ప్రాంతాలలో రద్దీని బట్టి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా.. ఉచిత బస్సు ప్రయాణంను వచ్చే సంక్రాంతి నుంచి అమలు చేసేందుకు సన్నాహలు చేస్తున్నట్లు కూడా.. ప్రభుత్వ విప్ ఒక ప్రకటనలో వెల్లడించినట్లు తెలుస్తొంది. దీంతో మహిళలు మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నట్లు సమాచారం. మరొవైపు ప్రభుత్వం దీనిపై అధికారికంగా స్పందించాల్సి ఉంది.