Gemstone Benefits: ఆ రత్నం ధరిస్తే..ఇక ఉద్యోగం, పదోన్నతి, డబ్బు అంతా లాభమే

Sat, 10 Sep 2022-4:55 pm,

ఎమెరాల్డ్ రత్నాన్ని పచ్చని దారం లేదా ఛైన్ లో లాకెట్ రూపంలో కూడా ధరించవచ్చు. బుధవారం ఉదయం వేళ పచ్చిపాలు లేదా గంగాజలంతో ఎమెరాల్డ్ రత్నాన్ని అభిషేకించి..ధరించాలి. తరువాత బుధ మంత్రం జపించాలి. 

ఎమెరాల్డ్ థారణ కూడా సరిగ్గా ఉండాలి. లేకపోతే ఆశించిన ఫలముండదు. ఎమెరాల్డ్ ధారణ ఎప్పుడూ వెండి ఉంగరంలోనే ఉండాలి. చిటికెన వేలుకే ధరించాలి. జ్యోతిష్య పండితుల సూచన అవసరం.

మిధునరాశివారికి వైవాహిక జీవితం సరిగ్గా లేకపోతే..ఎమెరాల్డ్ రత్నాన్ని ధరించాలి. దీనివల్ల వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురౌతాయి. కన్యారాశివారు ఎమెరాల్డ్ ధరిస్తే..తల్లిదండ్రులు, ఉద్యోగం, వ్యాపారాల్నించి లాభం కలుగుతుంది. 

ఎమెరాల్డ్ ధరించడం వల్ల అసంపూర్ణంగా ఉన్న పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో సరైన స్థానంలో ఎమెరాల్డ్ అమర్చుకుంటే మంచి ఫలితాలుంటాయి. దాంతోపాటు సంతాన సుఖం కోరుకునేవారు కూడా ఈ రత్నమే ధరించాలి.

బుధ గ్రహం బుద్ధుడికి కారకమైన గ్రహం. ఆత్మ విశ్వాసం లోపించినా లేదా బుద్ధి తగ్గినా ఎమెరాల్డ్ ధరించాలి. ఆత్మ విశ్వాసంతోనే బుద్ధి వికసిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం అభివృద్ధి చెందాలంటే ఎమెరాల్డ్ తప్పకుండా ధరించాల్సిందే. ఉద్యోగ, వ్యాపార వర్గాలకు అభివృద్ధి ఉంటుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link