OnePlus Nord CE 3 Lite Price: వాలెంటైన్స్ డే అమెజాన్ బంఫర్ ఆఫర్..Nord CE 3 Lite 5G మొబైల్‌పై రూ.17,050 తగ్గింపు!
ప్రముఖ టెక్ కంపెనీ OnePlus ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసిన Nord CE 3 Lite 5G సిరీస్ మొబైల్ అమెజాన్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్ ధర MRP రూ.19,999తో అందుబాటులో ఉంది. దీంతో పాటు 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ కూడా లభిస్తోంది.
అమెజాన్ వాలెంటైన్స్ డే సందర్భంగా అందిస్తున్న ఈ సేల్‌లో భాగంగా OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా 10 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఫ్లాట్ తగ్గింపు పోను కేవలం రూ. 17,999కే లభిస్తుంది. అలాగే దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో Amazon pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు రూ.150 వరకు తగ్గింపు లభిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ అదనంగా తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా అందించింది. ఈ ఎక్చేంజ్ ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.17,050 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ మొబైల్ రూ.949కే పొందవచ్చు.
ఈ OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్ 108 MP బ్యాక్ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు 2MP డెప్త్ లెన్స్ కెమెరా, 16MP ఫ్రాంట్ కెమెరాతో అందుబాటులో ఉంది. దీంతో పాటు అనేక రకాల శక్తి వంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంది.