Drop Thomson 43 inch Tv Price: ఫ్లిప్‌కార్ట్‌లో Thomson 43 inch స్మార్ట్ టీవీ కేవలం రూ. 19,499కే..డిస్కౌంట్‌ వివరాలు ఇవే!

Fri, 19 Jan 2024-7:31 am,

ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తున్న రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా స్మార్ట్ టీవీలపై ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. ముఖ్యంగా గత సంవత్సరంలో మార్కెట్లోకి విడుదలైన కొన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ టీవీలు ఈ సేల్‌లో 40 శాతం కంటే ఎక్కువ డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి.   

ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన Thomson Phoenix 108 cm (43 inch) QLED Ultra HD (4K) స్మార్ట్ టీవీపై ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక డీల్ నడుస్తోంది. ఈ డీల్లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు 34 శాతం వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్స్ కూడా పొందవచ్చు.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో Phoenix 108 cm (43 inch) స్మార్ట్ టీవీ అసలు ధర రూ.31,999 కాగా రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా 34 శాతం తగ్గింపుతో కేవలం రూ. 20,999కే లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్ టీవీని అదనపు తగ్గింపుతో కూడా కొనుగోలు చేయవచ్చు దీనికోసం బ్యాంక్ ఆఫర్స్ వినియోగించాల్సి ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్‌ ఈ స్మార్ట్ టీవీ బై బ్యాంక్ ఆఫర్స్‌ని కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా Thomson Phoenix 108 cm (43 inch) QLED Ultra HD (4K) స్మార్ట్ టీవీని కొనుగోలు చేసే క్రమంలో ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా బిల్ చెల్లిస్తే రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది.  

అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్‌ను వినియోగించి కూడా అదనపు తగ్గింపును పొందవచ్చు. ఈ బ్యాంకు క్రెడిట్ కార్డుతో బిల్ చెల్లిస్తే దాదాపు ఐదు శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ స్మార్ట్ టీవీ రూ. 19,499కే పొందవచ్చు.  

దీంతోపాటు ఈ Thomson Phoenix 108 cm (43 inch) స్మార్ట్ టీవీపై ఫ్లిప్‌కార్ట్‌ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తుంది. మీ పాత స్మార్ట్ టీవీని ఈ ఆఫర్ ద్వారా ఎక్స్చేంజ్ చేసి దాదాపు రూ.1800 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో మీరు ఈ టీవీని మరింత తగ్గింపుతో పొందుతారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link