GHMC Elections: ఓటు హక్కు వినియోగించుకున్న కీలక నేతలు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కాచిగూడలోని దీక్ష మోడల్ స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబసమేతంగా వచ్చిన కిషన్ రెడ్డి క్యూలైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాష్ట్ర మంత్రి కేటీఆర్ బంజారాహిల్స్‌లోని నందినగర్ జీహెచ్ఎంసీ కమిటీ హాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన కేటీఆర్ పోలింగ్‌బూత్ 8లో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పాతబస్తీలోని ఫయాజ్ స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.