Gold and Silver Rates Today : తగ్గిన బంగారం-వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే ?
Today Gold Rate In Hyderabad: ఆగస్టు 27వ తేదీ మంగళవారం బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. నిన్నటితో పోల్చి చూసినట్లయితే బంగారం ధర దాదాపు 100 రూపాయలు తగ్గింది. నేడు హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,350 రూపాయలుగా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 66,950 రూపాయలుగా ఉంది. బంగారం ధరలు గత వారంతో పోల్చి చూసినట్లయితే స్వల్పంగా తగ్గినట్లు గమనించవచ్చు. బంగారం ధరలు పెరగడానికి అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులే ప్రధాన కారణంగా చెబుతున్నారు.
ముఖ్యంగా అమెరికాలో నెలకొన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికాలో ప్రస్తుతం బంగారం ఒక ఔన్స్ ధర 2500 డాలర్లను పైన ట్రేడ్ అవుతోంది .ఇది భవిష్యత్తులో 2700 వరకు పెరిగే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగినట్లయితే దేశీయంగా కూడా బంగారం ధరలు 80,000 రూపాయలకు పైగా పెరిగే అవకాశం కనిపిస్తోంది .
అయితే వచ్చే దీపావళి నాటికి బంగారం ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈలోగా సెప్టెంబర్ మాసంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ భేటీలో వడ్డీ రేట్లు తగ్గిస్తాయని వార్తలు కూడా బంగారం ధరను పెంచేందుకు దోహదం చేస్తున్నాయి. బంగారం ధరలు గత నెలలో భారీగా తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ నెల ప్రారంభం నుంచి కూడా బంగారం ధరలు పెరుగుతూనే వస్తున్నాయి.
ఒక దశలో బంగారం ధర మరోసారి 74 వేల రూపాయల స్థాయిని తాకింది. కానీ మళ్లీ బంగారం ధర స్వల్పంగా తగ్గుతూ ప్రస్తుతం 73 వేల రూపాయల సమీపంలో ట్రేడ్ అవుతోంది.
బంగారం ధర భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అటు పసిడి ప్రియులు ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఒక్క గ్రాము తేడా వచ్చిన మీరు దాదాపు 7500 వరకు నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
అందుకే ఒకటికి రెండుసార్లు బంగారం తూకం విషయంలోనూ నాణ్యత విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచన చేస్తున్నారు. ముఖ్యంగా హాల్ మార్క్ ఉన్నటువంటి బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నగల దుకాణాల వారికి కేవలం హాల్మార్కు బంగారాన్ని మాత్రమే విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మీరు బంగారు నగలు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా ఎంత చిన్న నగ అయినప్పటికీ, హాల్ మార్క్ ఉందా లేదా అన్న విషయాన్ని మీరు ఆ నగపై గమనించాల్సి ఉంటుంది.