Gold Price In Hyderabad 16th June 2021: హైదరాబాద్‌లో దిగొచ్చిన బంగారం ధర, లేటెస్ట్ రేట్లు ఇలా

Wed, 16 Jun 2021-11:20 am,

Gold Rate Today 16 June 2021: అన్ని రంగాలతో పాటు బులియన్ మార్కెట్‌పై సైతం కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపింది. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర దిగొచ్చింది. ఢిల్లీలో పసిడి నిలకడగా మార్కెట్ అవుతోంది. వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర పెరగగా, ఢిల్లీలో ధరలు మరోసారి క్షీణించాయి.

Gold Price in Hyderabad 16th June 2021: హైదరాబాద్‌, విజయవాడలలో బంగారం ధర మరోసారి దిగొచ్చింది. రూ.170 మేర తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల ధర రూ.49,4700కి పతనమైంది. నేడు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,350కి ధర తగ్గింది.

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో పసిడి ధరలు నిలకడగా ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,790 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,640 వద్ద నిలకడగా ఉంది.

వెండి ధరలు గత వారాంతం నుంచి తగ్గుముఖం పడుతున్నాయి. ఓవైపు అన్‌లాక్ ప్రక్రియ మొదలైనా ఢిల్లీలో వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. రూ.200 మేర తగ్గడంతో 1 కేజీ వెండి ధర రూ.71,300కు దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనూ వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో రూ.200 మేర పెరగడంతో వెండి 1 కేజీ ధర రూ.76,100కు చేరుకుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link