Gold Price In Hyderabad: వరుసగా ఏడోరోజూ దిగొచ్చిన బంగారం ధరలు, వెండి ధర ఢమాల్
Gold Rate Update 17 June 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పతనమయ్యాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర వరుసగా ఏడోరోజు దిగొచ్చింది. ఢిల్లీలో పసిడి ధర స్వల్పంగా తగ్గింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలోనూ వెండి ధరలు రూ.1000 మేర తగ్గడంతో కేజీ ధర భారీగా క్షీణించింది.
Gold Rate in Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం తగ్గుతున్నా బులియన్ మార్కెట్‌పై మాత్రం ఎఫెక్ట్ చూపుతోంది. గత వారం రోజులుగా హైదరాబాద్, విజయవాడలలో బంగారం ధరలు పతనమవుతున్నాయి. నేడు సైతం నిన్నటి ధరలతో విక్రయాలు జరుగుతున్నాయి. బంగారం 10 గ్రాముల ధర రూ.49,460 వద్ద కొనుగోళ్లు జరుగుతున్నాయి. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,340 అయింది.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో పసిడి ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. గురువారం నాడు ఢిల్లీలో రూ.200 మేర పసిడి ధర తగ్గడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,590కి పతనమైంది. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.47,490కు పడిపోయింది.
ఢిల్లీలో వరుసగా నాలుగోరోజు వెండి ధరలు క్షీణించాయి. తాజాగా రూ.1000 మేర భారీగా దిగిరావడంతో నేడు 1 కేజీ వెండి ధర రూ.70,300కు పతనమైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ వెండి ధరలు రూ.1,100 మేర భారీగా పతనమయ్యాయి. దీంతో నేడు హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో వెండి 1 కేజీ ధర రూ.75,100కు దిగొచ్చింది.