Gold Price Today In Hyderabad 18th June 2021: సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. భారీగా దిగొస్తున్న బంగారం, వెండి ధరలు
Gold Rate Update 18 June 2021: బులియన్ మార్కెట్‌లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర మరోసారి పతనం కాగా, ఢిల్లీలోనూ బంగారం ధరలు తగ్గుమముఖం పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలోనూ వెండి ధరలు తగ్గడంతో 1 కేజీ ధర రూ.70 వేల దిగువకు పడిపోయింది.
హైదరాబాద్ (Gold Rate in Hyderabad), విజయవాడల మార్కెట్లో బంగారం ధరలు మరోసాయి దిగొచ్చాయి. తాజాగా రూ.540 దిగిరావడంతో తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.48,930కి పతనమైంది. అదే సమయంలో 22 క్యారెట్లపై సైతం ధర తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.44,850కి క్షీణించింది.
ఢిల్లీ మార్కెట్‌లో గత వారం రోజులుగా పసిడి ధరలు తగ్గుతున్నాయి. తాజాగా ఢిల్లీలో రూ.700 మేర పసిడి ధర భారీగా దిగొచ్చింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,900కి పతనమైంది. మరోవైపు 22 క్యారెట్ల పసిడికి డిమాండ్ తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.47,000 దిగొచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. తాజాగా రూ.2,600 మేర భారీగా దిగిరావడంతో రూ.70 వేల మార్కుకు కిందగి దిగింది. 1 కేజీ వెండి రూ.67,700 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడలలో వెండి ధర వరుసగా రెండోరోజు పతనమైంది. తాజాగా రూ.1,100 మేర భారీగా దిగిరావడంతో నేడు హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో వెండి 1 కేజీ ధర రూ.74,000కు పడిపోయింది.