Gold Price Today: మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు
బులియన్ మార్కెట్‌లో డిసెంబర్ నెలలో బంగారం ధరలు అనూహ్యంగా మారిపోతున్నాయి. కొన్ని రోజులు ధర పెరగడం, వెంటనే మరో రెండు మూడు రోజులు తగ్గడం జరుగుతుంది. తాజా మరోసారి బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా, దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ సైతం అదే దారిలో పయనిస్తోంది.
Also Read: PM Kisan Scheme: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ.. వివరాలు ఇలా చెక్ చేసుకోండి
Gold Price Today in Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యకేంద్రాలైన విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ (Hyderabad)లలో బంగారం ధర 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.30 మేర స్వల్పంగా పెరగడంతో 10 గ్రాముల పసిడి ధర రూ.51,310 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.30 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.47,110 చేరింది.
Gold Price Today In Delhi: దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర (Gold Price Today)లలో స్థిరంగా ట్రేడ్ అవుతున్నాయి. ఢిల్లీలో తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం నిన్నటి ధరలో కొనసాగుతోంది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.53,240 వద్ద ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర సైతం నిన్నటి ధరతో విక్రయాలు జరుగుతున్నాయి. గత ఐదు రోజుల మాదిరిగానే ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.48,810 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
Silver Price Today in India: బంగారం ధరలతో పోటీపడి మరి వెండి ధరలు పెరుగుతున్నాయి. డిసెంబర్ తొలి అర్ధభాగంలో వెండి ధరలు భారీగా పెరిగాయి. అయితే ఢిల్లీ మార్కెట్‌లో వరుసగా మూడు రోజులు తగ్గిన వెండి ధర తాజాగా రూ.1300 మేర పెరిగింది. నేటి మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.68,900 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.1400 మేర పెరిగింది. తాజాగా ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.72,600కి ఎగబాకింది.