Gold Price Today: బులియన్ మార్కెట్‌లో మళ్లీ పెరిగిన బంగారం ధరలు, రికార్డు స్థాయికి చేరిన Silver Price
బులియన్ మార్కెట్‌లో జనవరి నెలాఖరులో బంగారం ధరలు(Gold Price Today 31st January 2021), వెండి ధరలు భారీగా నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
Also Read: 7th Pay Commission: ఎల్‌టీసీ అలవెన్స్ చెల్లింపులపై 7వ వేతరణ సంఘం గుడ్ న్యూస్
తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ (Hyderabad)లలో బంగారం ధర స్వల్పంగా పుంజుకుంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.150 మేర పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.49,950 అయింది. 22 క్యారెట్ల బంగారం సైతం రూ.150 పెరగడంతో నేడు 10 గ్రాముల బంగారం ధర రూ.45,800కి చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా రూ.160 మేర బంగారం ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,300 అయింది. అదే సమయంలో 22 క్యారెట్లపై రూ.150 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.47,950కి ఎగసింది.
Also Read: EPFO: మీరు ఈపీఎఫ్ ఖాతాదారులా, అయితే ఈజీగా EPF Passbook Download చేసుకోండి
ఢిల్లీలో వరుసగా రెండోరోజు వెండి ధర భారీగా పుంజుకుంది. తాజాగా వెండి ధర రూ.2,200 మేర పెరిగింది. నేడు 1 కేజీ వెండి ధర రూ.67,000కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రెండు రోజుల్లోనే రూ.8,600 మేర పెరిగింది. దీంతో ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.74,600 అయింది.
Also Read: WhatsApp Chat: మీ వాట్సాప్ ఛాటింగ్ డేటాను Telegram Appకు ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకోండి