Gold Price Today In Hyderabad: బంగారం కొనుగోలుదారులకు షాక్, భారీగా పెరిగిన బంగారం ధరలు
Gold Rate Today 09 May 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వారాంతంలోనూ పెరిగాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు భారీగా పెరగగా దేశ రాజధాని ఢిల్లీలో భారీగా పతనమయ్యాయి. తెలుగు రాష్ట్రాలలో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..
తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ మార్కెట్లలలో బంగారం ధరలు(Gold Price Today In Hyderabad) వరుసగా నాలుగోరోజు భారీగా పెరిగాయి. తాజాగా రూ.520 మేర బంగారం ధర పెరగడంతో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,180కి పెరిగింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,610 వద్ద మార్కెట్ అవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్‌లో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. ఢిల్లీలో రూ.2,990 మేర దిగిరావడంతో 24 క్యారెట్లు బంగారం 10 గ్రాముల ధర రూ.47,000 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,000 వద్ద స్థిరంగా మార్కెట్ అవుతోంది.
బులియన్ మార్కెట్‌లో వెండి ధర స్థిరంగా ఉంది. తాజాగా ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.71,500 వద్ మార్కెట్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర వీకెండ్‌లో స్థిరంగా మార్కెట్ అవుతోంది. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.76,100 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.