Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్లో స్థిరంగా బంగారం ధరలు, మళ్లీ క్షీణించిన వెండి ధరలు
Gold Rate Update 23 May 2021: కరోనా సెకండ్ వేవ్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. గత రెండు రోజులుగా అవే ధరలలో యథాతథంగా మార్కెట్ అవుతున్నాయి. లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ ప్రభావం ఉన్నా ఇటీవల బంగారం ధరలు పెరిగాయి. గత రెండురోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. మరోవైపు వెండి ధర వరుసగా నాలుగోరోజు దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు పతనమయ్యాయి. బంగారం, వెండి లేటెస్ట్ రేట్స్ మీకోసం..
Gold Rate Today In Hyderabad | తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ మార్కెట్లలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,750 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,600 అయింది.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో ఇటీవల స్వల్పంగా పుంజుకున్న బంగారం ధర స్థిరంగా మార్కెట్ అవుతోంది. తాజాగా ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,830 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,930గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో బులియన్ మార్కెట్‌లో వెండి ధర వరుసగా నాలుగో రోజు దిగొచ్చింది. వెండి ధర రూ.1,100 మేర పతనం కావడంతో తాజాగా ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.71,100కు పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.700 మేర పతనమైంది. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.75,700 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.