7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్, త్వరలోనే Dearness Allowance జమ

Thu, 11 Mar 2021-7:38 pm,

డీఏ ప్రకటన కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు శుభవార్త వచ్చింది. పెండింగ్‌లో ఉన్న వాయిదాల భత్యం సవరించిన రేట్లలో 2021 జూలై 1 నుండి అమలులోకి రానుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Also Read: DA Hike Latest News: 7వ వేతన సంఘం సిఫార్సు, త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, TA మరియు DR అలవెన్సులు

ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు వాయిదాల డీఏను నిలిపివేసినట్లు తెలిపారు. తద్వారా కేంద్ర ప్రభుత్వంతో రూ.35,430.08 కోట్లకు పైగా నిల్వ ఉన్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 2020లో దేశం వ్యాప్తంగా ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య కోవిడ్-19 (COVID-19) వ్యాప్తి సమయంలో ప్రభుత్వానికి భారీ నగదు నిల్వ దోహదం చేసిందని చెప్పవచ్చు.

Also Read: SBI Annuity Scheme: ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయండి, ప్రతినెలా SBI మీకు ఆదాయాన్ని అందిస్తుంది

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సైతం జవనరి 1, 2020, జూలై 1, 2020 తేదీన మరియు జవవరి 1, 2021 ఇలా మూడు దఫాలలో చెల్లించాల్సిన డీఏ(Dearness Allowances), డియర్‌నెస్ రిలీఫ్(Dearness Relief) పెండింగ్‌లో ఉంచినట్లుగా రాజ్యసభ్యకు లిఖితపూర్వకంగా వెల్లడించారు. కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటాన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ నిలిపివేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Also Read: Taxpayers Alert: మార్చి 31వ తేదీలోగా ఈ పనులు మీరు పూర్తి చేయాలని మరువొద్దు

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 17 శాతం DA లభిస్తుంది. 2021లో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డీఏను 4 శాతం పెంచడానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ తాజా నిర్ణయం జనవరి 1, 2021 నుండి అమలులోకి వస్తుంది. త్వరలో మరింత శాతం పెంచనుందని ఉద్యోగులు, పెన్షనర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: EPF Interest Rate: EPFO ఖాతాదారులకు కేంద్రం శుభవార్త, 6 కోట్ల మంది హర్షం

కోవిడ్ -19 (COVID-19) సంక్షోభం కారణంగా జూలై 2021 వరకు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 61 లక్షల మంది పింఛన్‌దారులకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) నిలుపుదల చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ గత ఏడాది ఏప్రిల్‌లో నిర్ణయం తీసుకుంది. కానీ ప్రస్తుతం కరోనా ప్రభావం, వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది.

Also Read: 7th Pay Commission: 5 ఏళ్ల అరియర్‌తో కలిపి డియర్‌నెస్ అలవెన్స్ 13 శాతం వరకు పెరగవచ్చు, Holiకి ముందే ఉద్యోగులకు DA Hike

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link