Pension Hike: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించిన మోదీ సర్కార్.. ఇకపై భారీగా పెరగనున్న పెన్షన్..ఎంతంటే?
Central Government Pensioners: మీరు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయితే మీకో గుడ్ న్యూస్. ఓపీఎస్ అంటే పాత పెన్షన్ స్కీమ్ కింద రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 80 నుంచి 85సంవత్సరాల మధ్య ఉన్న పెన్షనర్లకు 20శాతం పెన్షన్ ను పెంచింది. 85 నుంచి 90 సంవత్సరాల వయస్సు గల రిటైర్డ్ ఉద్యోగులకు 30శాతం పెంపు ఉంటుంది. 90 నుండి 95 సంవత్సరాల వయస్సు గల ఉద్యోగులకు 40శాతం..95 నుండి 100 సంవత్సరాల వయస్సు గల పెన్షనర్లు 50శాతం పెంపు పొందుతారు. 100 ఏళ్లు పైబడిన పెన్షనర్లకు 100శాతం పెంపుదల ఉండనుంది.
రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ ను 20శాతం నుంచి 100శాతానికి పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది వయస్సుతోపాటు పెరుగుతుంది.
80 నుంచి 85 సంవత్సరాల వయస్సు గల పెన్షన్ దారులు 20శాతం పెంపు పొందుతారు. 85 నుండి 90 సంవత్సరాల వయస్సు గల రిటైర్డ్ ఉద్యోగులకు 30శాతం..90 నుండి 95 సంవత్సరాల వయస్సు గల ఉద్యోగులకు 40శాతం పెంపు ఉంటుంది.
95 నుండి 100 సంవత్సరాల వయస్సు గల పెన్షనర్లు 50శాతం.. 100 ఏళ్లు పైబడిన పెన్షనర్లకు 100శాతం పెన్షన్ పొందుతారు. పాత పెన్షన్ స్కీమ్ కింద పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెంపునకు అర్హులు. ఇందుకోసం ఉద్యోగులు తప్పనిసరిగా 20 ఏళ్లు రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసి ఉండాలని పేర్కొంది.
నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటే ఎన్‌పిఎస్‌లో పెట్టుబడి పెట్టే ఉద్యోగులకు కూడా ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇప్పుడు ఈ ఉద్యోగులు 20 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ పొందవచ్చు. అయితే ఈ నిబంధన అమలులోకి వచ్చే తేదీని ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు.కానీ త్వరలోనే అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు.
పాత పెన్షన్ స్కీమ్ కింద పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్) కింద పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు.
ప్రస్తుతం ప్రతిపాదన మాత్రమే అయిన ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఈ పెంపు అదనపు పెన్షన్ లేదా అదనపు గ్రాట్యుటీ (ఎక్స్ గ్రేషియా) రూపంలో ఉంటుంది. ప్రభుత్వం అన్ని మంత్రిత్వ శాఖలు/విభాగాలు, పెన్షన్ మంజూరు చేసే సంస్థలు/బ్యాంకులు ఈ నియమాన్ని పాటించాలని కోరింది.
పాత పెన్షన్ విధానంలో పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు ఇది శుభవార్త. దీనికి సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ వెలువడగానే పెన్షనర్లకు పెరిగిన పింఛను అందనుంది.