Good news For Telangana Employees: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఆన్లైన్ ద్వారానే మెడికల్ రీయిoబర్స్మెంట్

Sat, 09 Nov 2024-11:10 am,

Online Medical Reimbursement: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ఇకపై ఉద్యోగులు మెడికల్ రియంబర్స్మెంట్ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సైతం స్వీకరిస్తామని నిర్ణయం తెలిపింది. దీంతో ఉద్యోగ సంఘాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు పంపించింది. 

దీనిపై అతి త్వరలోనే కార్యాచరణ సైతం చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లులను నేరుగా తీసుకొని పరిశీలించేవారు. అయితే ఇకపై ఆన్లైన్ ద్వారా మాత్రమే మెడికల్ బిల్లులను ప్రవేశపెట్టాలని తద్వారా పని వేగవంతం అవుతుందని అధికారులు చెబుతున్నారు.   

గతంలో నేరుగా బిల్లులను సబ్మిట్ చేయడం ద్వారా ఎక్కువ సమయం తీసుకునేదని, ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా తీసుకోవడం ద్వారా పనితీరు వేగవంతమైన అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తద్వారా ఉద్యోగులు పెన్షన్ దారులకు వైద్య చికిత్స సమయంలో ఖర్చును వేగంగా పొందే అవకాశం ఉంటుంది.   

ప్రస్తుతం రాష్ట్రం వ్యాప్తంగా దాదాపు 25 నుంచి 30 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ దారులు ఉన్నారు. గతంలో వీరు అనారోగ్యం పారిన పడినట్లయితే ఆసుపత్రి పాలైన లేదా ఏదైనా శస్త్ర చికిత్స చేయించుకున్న ప్రభుత్వం రియంబర్స్ చేసేది. అయితే 50 వేల లోపు చికిత్స బిల్లులను జిల్లా స్థాయిలో సబ్మిట్ చేయాల్సి ఉండేది.   

ఇక రెండు లక్షల రూపాయలు దాటిన బిల్లులను డీఎంఈ స్థాయిలో శాంక్షన్ చేయాల్సి వచ్చేది. అంతకు మించిన బిల్లులను ప్రభుత్వం వేసిన కమిటీ పరిశీలించేది. అయితే ఈ ప్రక్రియ చాలా జాప్యంతో కూడుకున్నది. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ దారులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.   

వీటన్నింటినీ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెడికల్ బిల్లుల రీయింబర్స్మెంట్ డీఎంఈ నుంచి కాకుండా ఇకపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా నిర్వహించాలని కూడా సర్కారు భావిస్తోంది. ఆరోగ్య శ్రీ ట్రస్టులో నిపుణులైన వైద్యులు ఈ బిల్లులను పర్యవేక్షిస్తారు తద్వారా వేగంగా బిల్లుల అమౌంట్ జారీ చేసే అవకాశం లభిస్తుంది.   

గతంలో బిల్లుల స్కూటీనీ కోసం ప్రతినెల  దాదాపు నాలుగు నుంచి ఐదువేల బిల్లులు వచ్చేవి. కానీ సిబ్బంది కొరత వల్ల కేవలం 150 బిల్లులను మాత్రమే పరిశీలించడానికి సమయం లభించేది. దీంతో వేలాది బిల్లులు పెండింగ్లో పడటం పరిపాటిగా మారింది ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link