Stress: ఒత్తిడితో నష్టాలే కాదు లాభాలు కూడా.. ఎలా అంటే..?

Wed, 28 Aug 2024-8:24 pm,

అయితే ఈ ఒత్తిడి సాధ్యమైనంత వరకు నష్టాలే మిగుల్చుతుంది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం,  ఈ ఒత్తిడి వల్ల నష్టాలే కాదు లాభాలు కూడా ఉన్నాయట. ఒత్తిడి వల్ల లాభాలేంటి అని ఆలోచిస్తున్నారా?  మరి ఆ ఒత్తిడి వల్ల కలిగే లాభాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. 

సుదీర్ఘకాలం పాటు ఉండే ఒత్తిడి అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. కానీ అప్పుడప్పుడు కలిగే పరిమిత స్థాయి ఒత్తిడి ప్రయోజనాలను కలిగిస్తుందట. శాస్త్ర పరిభాషలో.. ఈ తరహా ఒత్తిడిని యూస్ట్రెస్  అని అంటారు. ఇది శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతోందట. కష్టమైన పనులు చేసేటప్పుడు ఇతర ఒత్తిడి కలుగుతుందని అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ వెల్లడించింది. ముఖ్యంగా ఈ తరహా ఒత్తిడి వల్ల  శరీరంలో కలిగే ప్రతిస్పందనలు ఆందోళన కుంగుబాటును ఎదుర్కోవడంలో సహాయపడతాయి. 

తక్కువ స్థాయి ఒత్తిడితో మెదడు ఉత్తేజితమై న్యూట్రోసీన్స్ అనే కెమికల్స్ విడుదల అవుతాయట. ఇవి నాడీ కణాల మధ్య అనుసంధానతను పెంచి ఏకాగ్రత ఉత్పాదకతను మెరుగుపరుస్తాయని సమాచారం. 

స్వల్ప ఒత్తిడి కారణంగా మనలో రోగనిరోధక శక్తి మరింత బలోపేతం అవుతుంది. ఇలాంటి ఒత్తిడి వల్ల భవిష్యత్తులో కూడా మరెన్నో సవాళ్ళను ఎదుర్కొని మానసిక శారీరక సామర్థ్యాలను కలిగి ఉంటాం. అంతేకాదు ఈ ఒత్తిడి వల్ల విజయం సాధించాలనే పట్టుదల మనలో పెరుగుతుందట. పరిస్థితులకు అనుగుణంగా మారిపోయి ఉత్పాదకత పెంచడానికి తోడ్పడుతుందని సమాచారం. 

గర్భిణీ స్త్రీలు కూడా ఇలాంటి ఒత్తిడిని అనుభవిస్తారు.  ఇలా ఒత్తిడి అనుభవించినప్పుడు.. బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడుతుందని కూడా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఒత్తిడి ఏదైనా సరే మంచి ఒత్తిడి , చెడు ఒత్తిడి మధ్య తేడాను తెలుసుకోవడం అత్యంత కీలకమని నిపుణులు చెబుతున్నారు. రోజంతా ప్రతికూల ఆలోచనలు ఆందోళనతో గడిపేవారు కచ్చితంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తూ ఉండడం గమనార్హం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link