Google Pixel 9 Series: గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లాంచ్ నేడే, ధర, ఫీచర్లు ఇలా
Google Pixel 9 Features and Price
గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ 6.3 అంగుళాల డిస్‌ప్లేతో బ్లాక్, పార్శిలియన్, పింక్, లైట్ గ్రే, బ్లాక్ రంగుల్లో లభ్యం కానుంది. టెన్సార్ జి4 చిప్‌సెట్, 12జీబీ ర్యామ్ కలిగి ఉంటుంది. గ్లాస్ ఎక్స్‌టీరియర్ ఉంటుంది. ఈ ఫోన్ ధర 55 వేల నుంచి 67 వేల వరకూ ఉండవచ్చు
Google Pixel 9 pro, pixel 9 Pro XL Features and Price
గూగుల్ పిక్సెల్ 9 ప్రో, గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ ఫోన్లు టెన్సార్ జి4 చిప్‌సెట్ కలిగి 16 జీబీ ర్యామ్‌తో రానున్నాయి. పిక్సెల్ 9 ప్రో అయితే 458 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. అదే పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ అయితే 4942 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. పిక్సెల్ 9 ప్రో 12జీబీ వేరియంట్ ధర 1,17,755 రూపాయలుగా ఉండవచ్చు. అదే 256 జీబీ వేరియంట్ అయితే 1,28,456 రూపాయలు ఉండవచ్చు. ఇక 512 జీబీ వేరియంట్ అయితే 1,42,384 రూపాయలుగా ఉంటుందని అంచనా
Google Pixel 9 Pro Fold Features
గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ 6.4 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే కలిగి ట్రిపుల్ కెమేరా సెటప్‌తో వస్తోంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ, 10.5 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్, 10.8 ఎంపీ టెలీ ఫోటో షూటర్ ఉంటే సెల్ఫీ లేదా వీడియా కాలింగ్ కోసం 10 ఎంపీ షూటర్ కెమేరా ఉంటుంది.
Google Pixel 9 Pro Fold Price
గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ 256 జీబీ వేరియంట్ ఫోన్ 1,74,069 రూపాయలుంటుంది. ఇందులోనే 512 జీబీ వేరియంట్ అయితే 1,85,096 రూపాయలు ఉంజవచ్చు. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లు రేపు అంటే ఆగస్టు 14 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది