Gratuity Calculation: గ్రాట్యుటీ ఫార్ములా ఏంటి, ఎలా లెక్కిస్తారు , ఎంత వస్తుందో తెలుసా
అయితే నోటీస్ పీరియడ్ గ్రాట్యుటీ చెల్లించే క్రమంలో లెక్కిస్తారా లేదా అనేది మరో సందేహం. కచ్చితంగా నోటీసు పీరియడ్ కూడా గ్రాట్యుటీ ఇచ్చేటప్పుడు పరిగణలో తీసుకుంటారు. అంటే ఎవరైనా ఉద్యోగి 4 ఏళ్ల 10 నెలలు పనిచేసుండి రెండు నెలలు నోటీసు పీరియడ్ ఉంటే ఆ వ్యక్తికి గ్రాట్యుటీ వర్తిస్తుంది
గ్రాట్యుటీ చట్టం ప్రకారం మీరు పనిచేసే సంస్థ రిజిస్టర్ కాకపోతే ఆ కంపెనీ స్వచ్ఛందంగా గ్రాట్యుటీ ఇస్తుంది. ఈ సందర్భంలో గ్రాట్యుటీ అనేది జీతంలో సగం ఉంటుంది.
1972 గ్రాట్యుటీ చట్టం ప్రకారం గ్రాట్యుటీ లెక్కించేందుకు ఓ ఫార్ములా ఉంది. ఉద్యోగుల కనీస వేతనం, ఉద్యోగం చేసిన వ్యవధిని 15/26తో గుణిస్తారు. అంటే బేసిక్ శాలరీ 75 వేలుండి 10 ఏళ్లు పనిచేసుంటే 75000 x (10 years) x (15/26) అవుతుంది. అంటే 4,32,692 రూపాయలు గ్రాట్యుటీ లభిస్తుంది.
గ్రాట్యుటీ చట్టం 1972 ప్రకారం ఎవరైనా ఓ ఉద్యోగి 5 ఏళ్లు దాటి పనిచేస్తే ఉద్యోగం మానేసేముందు ఆ వ్యక్తికి గ్రాట్యుటీ చెల్లిస్తారు. గ్రాట్యుటీ అనేది ఉద్యోగులకు ఓ వరం లాంటిది. ఈ క్రమంలో గ్రాట్యుటీ ఎంత వస్తుంది, ఎలాలెక్కిస్తారనేది చాలామందికి తెలియదు. ఈ ఆర్టికల్‌లో మనం గ్రాట్యుటీ ఎలా లెక్కిస్తాం, పార్ములా ఏంటనేది తెలుసుకుందాం..