1857-1947: దేశం ఎప్పటికీ రుణపడి ఉండే స్వాతంత్ర్య సమరయోధులు
ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించిన ధీరుడు. దీనినే ఆజాద్ హింద్ ఫౌజ్ అనేవాళ్లు. స్వామి వివేకానంద ప్రభావం సుభాష్ చంద్రభోస్ పై ఎక్కువగా ఉండేది. నాకు రక్తం ఇవ్వండి. నేను మీకు స్వాతంత్ర్యం తీసుకొస్తాను అన్నారు
క్విట్ ఇండియా మూమెంట్ సమయంలో సమాచార ప్రసారం కోసం రహస్య కాంగ్రెస్ రేడియోను ఏర్పాటు చేశారు. దీంతో ఆమెను బ్రిటిషు వారు ఎరవాడ జైలులో బంధించారు.
ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత దేశం అనేక గణ రాజ్యాలుగా విభజించి ఉంటే వాటిని భారత దేశంలో భాగం చేశారు. సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా మూమెంట్ లో చురుకుగా పాల్గొన్నారు.
సాహసానికి మారుపేరు. బ్రిటిష్ ఆర్మీని గడగడలాడించిన ధీర వనిత ఝాన్సీ లక్ష్మిబాయి.1857 లో జరిగిన తొలి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడిన వీర వనిత
భారత స్వాతంత్ర్య ఉద్యమానికి నాంది పలికి తొలి దశ ఉద్యమకారులలో మంగల్ పాండే ఒకరు. 1857 సిపాయిల తిరుగుబాటులో కీలక పాత్ర పోషించారు.
జాతిపిత అని కూడా అంటారు. అహింసా మార్గంలో అద్భుతాలు సాధించవచ్చని.. ప్రపంచానికి సరికొత్త దిశానిర్దేశనం చేసిన మహోన్నతమైన వ్యక్తి. సహాయ నిరాకరణ ఉద్యమంతో పాటు పౌరహక్కులపై అంతర్జాతీయంగా పోరాటం కొనసాగించారు. దండి మార్చ్, క్విట్ ఇండియా మూమెంట్, సత్యాగ్రహ వంటి విధానాలతో బ్రిటిష్ వారి రాజ్యాన్ని కదిలించగలిగారు.
హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ ను స్థాపించి బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా ఉద్యమించారు. మహాత్మా గాంధి గారి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు.
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రజలను అత్యధికంగా ప్రేరణ కలిగించిన ఉద్యమ తార భగత్ సింగ్. చంద్రశేఖర్ ఆజాద్ స్థాపించిన హిందుస్తాన్ రిపబ్లిక్ అసోసియేషన్ లో సభ్యుడు.లాలా లజపత్ రాయ్ మరణానికి ప్రతీ కారం తీర్చుకోవడానికి అసెంబ్లీలో బాంబు విసిరాడు. 23 ఏళ్లకే భారత దేశ స్వాతంత్ర్యం కోసం ఉరితాడును ముద్దాడాడు.
భారత దేశంలో సామాజిక మార్పునకు దోహదం చేసి, భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన వ్యక్తి డాక్టర్ బాలా సాహెబ్ అంబేద్కర్. భారత దేశ తొలి లా మినిస్టర్ కూడా ఆయనే. సామాజిక వివక్షతను రూపుమాపడానికి పోరాడారు.