Green Chillies: పచ్చి మిరపకాయతో ఎన్నో లాభాలు పొందవచ్చు!
పచ్చి మిరపకాయలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి.
క్యాప్సైసిన్ నొప్పిని నివారించే లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల ఇది వాపు, కీళ్ల నొప్పులు, తలనొప్పి వంటి వాటికి చికిత్స చేయడంలో సహాయపడుతుంది
పచ్చి మిరపకాయలు చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి.
పచ్చి మిరపకాయలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
క్యాప్సైసిన్ శరీర ఉష్ణోగ్రతను పెంచడంలో సహాయపడుతుంది, దీనివల్ల కేలరీలు ఎక్కువగా కాలిపోతాయి.
పచ్చి మిరపకాయలు జీర్ణ రసాల పెంచడంలో సహాయపడతాయి. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.