Hair fall: మీ జుట్టు రాలిపోతుందా..ఇదిగో ఇలా చేయండి చాలు

Tue, 15 Dec 2020-8:26 pm,

జామ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. జాంపండు తింటే ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండులో విటమిన్ సి పెద్దఎత్తున ఉంటుంది. ఈ పండుతో కోలోజన్ ఉత్పత్తి పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య నుంచి కోలోజన్ కాపాడుతుంది. మీ జుట్టుకు బలాన్ని కూడా ఇస్తుంది. 

చాలా ఎక్కువ అద్భుత గుణాలు కలిగిన పండు స్ట్రా బెర్రీ. మీ ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తుంది. రాలుతున్న జుట్టును ఆపేందుకు ఈ పండ్లు చాలా ఉపయోగపడుతాయి. ఇందులో సిలికా, ఎలేజిక్ యాసిడ్ కాంబినేషన్ ఉంది. జుట్టును పెంచేందుకు పల్చగా అవకుండా ఆపేందుకు ఈ  పండ్లను రోజూ తినాలి.

బొప్పాయి పండ్లు చర్మంతో పాటు అంతర్గత ఆరోగ్యానికి చాలా మంచిది. అమైనో యాసిడ్లు, కోలోజన్, విటమిన్ సి పెద్దఎత్తున ఉంటాయి. మస్కిష్కానికి బలం చేకూర్చే సామర్ధ్యం కలిగున్నాయి. జుట్టును పటిష్టంగా ఉంచేందుకు దోహదపడే వి విటమిన్ సి  కోలోజన్ ఉత్పత్తిని పెంచుతుంది.

కివీ  (Kiwi)పండ్లు కాస్త తీపిగా కాస్త పులుగా ఉండే విటమిన్ సి Vitamin cతో సమృద్ధిగా ఉంటాయి. కొంతమంది ఇష్టంగా తింటారు. మరి కొంతమంది కష్టంగా తింటారు. ఈ పండ్లు మస్కిష్కానికి పోషకపదార్ధాల్ని రక్త ప్రసరణను Blood Circulation పెంచుతుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link