Hair Spa: పార్లర్‌కు వెళ్లకుండానే ఇంట్లో ఖరీదైన హెయిర్ స్పా.. ఇలా అప్లై చేయండి..
హెయిర్ స్పాను ఇంట్లోని వస్తువులతో సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అయితే, ఇంట్లోనే హెయిర్ స్పా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కొబ్బరి నూనె వేడి చేసి ఒక్క బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందులో అలోవెరా జెల్ వేసి కలపండి. ఆ తర్వాత విటమిన్ ఇ క్యాప్సూల్ కూడా వేయాలి. దీన్ని బాగా మిక్స్ చేస్తే ఓ జెల్ మాదిరి తయారవుతుంది.
ఇప్పుడు ఇది క్రీమ్ మాదిరి తయారవుతుంది. ఈ క్రీమ్ హెయిర్ స్పా వేసుకోవడం జుట్టుకు ఈ స్పా రాయడం వల్ల కండీషనింగ్ కూడా అందిస్తుంది. ఇది చుండ్రు, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్లు అందిస్తుంది.
హెయిర్ స్పా లో వాడే విటమిన్ ఇ క్యాప్సూల్ జుట్టుకు మాయిశ్చర్ అందిస్తుంది. ఇది జుట్టు మూలాల నుంచి కూడా పోషణ అందిస్తుంది. ఆ తర్వాత షవర్ క్యాప్ పెట్టుకుని ఓ అరగంట తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి.
మరోప్యాక్.. కొబ్బరినూనెను వేడి చేసి అందులో కలబంద వేసుకోవాలి. పెరుగు, తేనె, విటమిన్ ఇ క్యాప్సూల్ కూడా వేసి బాగా కలపాలి. ఇది క్రీమ్ మాదిరి తయారవుతుంది. జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. ఇందులో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. అరగంట తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)