Hansika New House: కొత్త ఇల్లు కొన్న అల్లు అర్జున్‌ హీరోయిన్‌.. ఈ `దేశముదురు` కొన్న ఇంటి ధర వింటే షాక్‌

Thu, 17 Oct 2024-8:02 pm,

తెలుగు సినీ ప్రేక్షకులకు హన్సిక మోత్వానీ సుపరిచితం. అల్లు అర్జున్‌తో కలిసి దేశముదురుతో సినీ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.

ఇటీవల కొత్త ఇంటిని కొనుగోలు చేసిన హన్సిక తాజాగా గృహ ప్రవేశ వేడుక నిర్వహించింది. గృహ ప్రవేశం తన భర్త సోహైల్‌ ఖతూరియాతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా హోమం నిర్వహించారు.

ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. 'న్యూ బిగినింగ్స్‌' అంటూ ఫొటోలను షేర్‌ చేసింది.

తలపై కలశం పెట్టుకుని ఇంట్లోకి అడుగుపెడుతున్న ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ వేడుక సందర్భంగా ఆకుపచ్చ చీరలో హన్సిక మెరిసింది. కొన్ని స్టిల్స్‌ ఇచ్చి సంబర పడింది.

తెలుగులో దేశముదురు, కంత్రి, కందిరీగ, దేనికైనా రెడీ తదితర సినిమాలు చేసి తమిళ్‌, హిందీ సినిమాల్లో నటించిన హన్సిక సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఓ టీవీ ఛానల్‌ నిర్వహిస్తున్న డ్యాన్స్‌ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

వ్యాపారవేత్త సోహైల్‌ ఖతూరియాను 4 డిసెంబర్‌ 2022న హన్సిక వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link