Vidya Balan in Saree: చీరకట్టులో విద్యాబాలన్ తరువాతే ఎవరైనా.. విద్యా బాలన్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
ప్రపంచంలోనే చీరకట్టుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. భారతీయ సంప్రదాయాలను ఇష్టపడే మగువలు ఎవరైనా.. ముందుగా ఓటు వేసేది చీరకే. చీర కట్టుకుంటేనే భారతీయత ఉట్టిపడుతుంది అనేది చాలామందికి ఉన్న బలమైన విశ్వాసం. అలాంటి చీరకట్టుకు విద్యా బాలన్ ఒక బ్రాండ్ అంబాసిడర్ లా ఉంటారు.
విద్యాబాలన్ ముంబైలోని చెంబూరులో ఒక తమిళ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించారు. విద్యార్హతల పరంగా చూస్తే.. ముంబైలోని సేయింట్ జేవియర్ కాలేజీలో మాస్టర్స్ లో సోషియాలజీ పట్టా అందుకున్నారు.
అప్పట్లో షబానా ఆజ్మీ, మాధురి దీక్షిత్ లాంటి స్టార్ హీరోయిన్స్ ని చూసి వారి నుండి ప్రేరణ పొందిన విద్యా బాలన్.. చిన్న వయస్సులోనే సినీ రంగాన్ని ఎంచుకున్నారు. ఆ క్రమంలోనే 16 ఏళ్ల ప్రాయంలోనే ఏక్తాకపూర్ రూపొందించిన హమ్ పాంచ్ అనే టీవీ షోలో రాధిక పాత్ర ద్వారా తెరంగేట్రం చేశారు.
విద్యా బాలన్ తొలుత 2003 లో భలో తీకో అనే బెంగాలి సినిమాతో ఫిలిం ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. 2005 లో ఆమె చేసిన హంది మూవీ పరిణీత సినిమానే ఆమెకు బాలీవుడ్ హీరోయిన్ గా భారీ గుర్తింపును ఇచ్చింది. పరిణీత సినిమాతో విద్యాబాలన్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూ కేటగిరీలో ఫిలింఫేర్ అవార్డ్ సొంతం చేసుకుంది. పరిణీత సినిమా తరువాత లీడింగ్ స్టార్ హీరోల సరసన వరుస సినిమా అవకాశాలు కొట్టేశారు.
2011 లో విద్యా బాలన్ చేసిన ది డర్టీ పిక్చర్ సినిమా ఆమెకు ఎంత గుర్తింపును తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఈ సినిమాతోనే తొలిసారిగా బెస్ట్ యాక్ట్రెస్‌గా నేషనల్ ఫిలిం అవార్డ్ దక్కించుకున్నారు.
విద్యాబాలన్ అంత అందగత్తె అయినప్పటికీ.. ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ.. ఆమె లావుగా ఉండటాన్ని కొంతమంది విమర్శించగా.. బాడీ షేమింగ్ తగదంటూ తనపై నోరుపారేసుకున్న వారికి విద్యాబాలన్ ఘాటుగానే రిప్లై ఇచ్చి వారి నోరు మూయించింది.
2012 లో ప్రముఖ నిర్మాత సిద్ధార్థ రాయ్ కపూర్ ని వివాహం చేసుకున్న విద్యా బాలన్.. అతడితో కలిసి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. తన మనసులోని భావాలను చెప్పడానికి ఏ మాత్రం వెనుకాడని నటి విద్యాబాలన్. అందుకే ఆమె కొంతమందికి బోల్డ్ హీరోయిన్‌గా కనిపించినా.. బాలీవుడ్ ఆడియెన్స్ మెచ్చిన బ్యూటీఫుల్, వండర్‌ఫుల్ హీరోయిన్స్‌లో ఆమె ఒకరని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు.