Propose Day 2021: చేతిలోన చెయ్యేసి చెప్పేయవా, మదిలో మాటల్ని ప్రపోజ్ చేసే తరుణమిదే

Mon, 08 Feb 2021-11:41 am,

Propose Day 2021 Wishes: ఫిబ్రవరి నెల రాగానే యువతీ మువకుల మదిలో మెదిలేది ప్రేమ, వాలెంటైన్స్ డే (Valentines Day 2021) ఆలోచనలు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 14న ‘వాలెంటైన్స్ డే’గా జరుపుకుంటారు. ప్రేయసి, ప్రేమికుడు తమ మనసులోని భావాలను చెప్పేందుకు ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. నిన్న రోజ్ డే కాగా, నేడు ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే. ప్రేమను కొన్ని విధాలుగా వ్యక్తం చేయవచ్చు.

Also Read: Valentines Day 2021: మీ ప్రేమను ఇలా తెలపడం బెటర్!

తమకు తోచినట్లుగా, స్థాయికి తగినట్లుగా తమ ప్రేయసి/ప్రియుడికి ఏదో ఒక బహుమతి ఇచ్చి మనసులోని మాటను ప్రపోజ్ చేస్తారు. ఎర్ర గులాబీలతో చేసిన ఓ బొకేను ఇచ్చి ప్రేమను వ్యక్తం చేయవచ్చు. అమ్మాయిలకు పువ్వులు, అందులోనూ ఎర్ర గులాబీలంటే చాలా ఇష్టం.

మీ ప్రియురాలి చేతికి ఓ ఉంగరాన్ని తొడుగుతూ ప్రపోజ్ చేయండి. ఆమె కళ్లల్లోకి చూస్తూ మనసులోని ప్రేమను చెబితే మీ ప్రేమకు అంతా శుభమే.

Also Read: Weird News: ప్రియురాలి ఇంటి వరకు సొరంగం తవ్వాడు.. తర్వాత ఏం జరిగిందంటే

లవ్ కొటేషన్ ఉన్న మంచి గ్రీటింగ్ కార్డును ఇచ్చి ప్రేమను వ్యక్తం చేయండి. లేకపోతే చేతితో ప్రేమ లేఖ రాసి, మీరే తనకు ప్రాణమని తెలిసేలా ప్రేమను, భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పగలగాలి.

ఔటింగ్‌కు తీసుకెళ్లి ఏకాంతంగా ఉన్నప్పుడు మీ ప్రేయసి/ప్రియుడికి ప్రపోజ్ చేస్తే అవతలి వ్యక్తి కేవలం మీ గురించే ఆలోచిస్తారు. మీ ప్రేమలో నిజాయితీ ఉంటే తనతో జీవితం ఎలా ఉంటుందో వివరించాలి.

Also Read: Candyologists: క్యాండీ అంటే ఇష్టమా, అయితే క్యాండీ తినే ఉద్యోగం మీ కోసం, ఎలాగో తెలుసా

మీకు ఏదైనా సంగీత వాద్యాలు వాయించే అలవాటు ఉంటే, ఆ మాధ్యమం ద్వారా మీ లవర్‌ను ఇంప్రెస్ చేసి, ఇన్నాళ్లుగా మనసులో మెదులుతున్న భావాలను వ్యక్తం చేసి ప్రేమలో విజయం సాధించండి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link