ప్రతి ఏడాది ఫిబ్రవరి 14న Valentines Day (ప్రేమికుల రోజు) జరుపుకుంటారు. ప్రేయసి, ప్రియుడు తమ మనసులోని భావాలను చెప్పేందుకు ఇదే సరైన సమయమని భావిస్తుంటారు. వారికి తోచినట్లుగా, స్థాయికి తగినట్లుగా తమ ప్రేయసి/ప్రియుడికి ఏదో ఒక బహుమతి ఇచ్చి మనసులోని మాటను చెబుతారు. వాలెంటైన్స్ వీక్‌లో రెండో రోజు ప్రపోజ్ డే (Propose day) సెలబ్రేట్ చేసుకుంటారు.
ఓ మంచి ఉంగరాన్ని గిఫ్ట్‌గా ఇస్తూ ప్రేమను వ్యక్తం చేసేవారు ఉంటారు. లేక మంచి కంపెనీ రిస్ట్ వాచీని బహుకరిస్తూ లవర్ కళ్లల్లోకి తదేకంగా చూస్తూ మనసులోని మాటను చెప్పవచ్చు. (Pic Courtesy: Pixabay image)
అమ్మాయిలకు పువ్వులంటే చాలా ఇష్టం. అందులోనూ ఎర్రటి రోజాలు ధరించిన రోజు వారు మరింత అందంగా ఉన్నట్లు భావిస్తారు. మీరు ఓ రోజా పువ్వును, లేక రోజా పూల బొకెను అందిస్తూ మనసులోని ప్రేమను ప్రపోజ్ చేయండి.
మీరు ప్రేమిస్తున్న వ్యక్తి (అబ్బాయి/అమ్మాయి)ని లంచ్, లేక డిన్నర్ చేద్దామని బయటకు పిలవండి. వారికి ఇష్టమైన ఆహారం ఆర్డర్ చేయండి. ఫుడ్‌ను ఆస్వాదిస్తూ మనసులో మాటను చెప్పండి
సంగీతవాద్యాలపై పట్టుంటే వాటిని ప్లే చేస్తూ మంచి సమయం చూసి ప్రేమ విషయాన్ని చెబితే ప్రయోజనం ఉండవచ్చు.
పెన్ను కదపడం మీకు అలవాటున్న వారైతే సొంతంగా ప్రేమను తెలుపుతూ లవ్ లెటర్ రాయడం బెటర్. ప్రేమ రిజెక్ట్ చేశారని కుంగిపోవాల్సిన అవసరం లేదని మనోతత్వవేత్తలు చెబుతారు. మీ వరకు ప్రయత్నం చేశారని, లేకపోతే అయ్యో నా ప్రేమను వ్యక్తం చేయలేకపోయానని జీవితాంతం నరకం అనుభవిస్తున్న వాళ్లు సైతం మీకు తారస పడుతుంటారు.
Next Gallery