Happy Republic Day 2024 Telugu: రిపబ్లిక్ డే స్పెషల్ కోట్స్, విషెస్, వాట్సాప్ స్టేటస్ మెసేజెస్, స్పెషల్ పిక్స్..
జనవరి 26న భారతదేశం ప్రజా ప్రభుత్వంగా ఏర్పడిన సందర్భంగా..ప్రతి ఒక్కరు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటూ.. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
భారతదేశం స్వేచ్ఛ కోసం త్యాగం చేసిన మహానుభావులు ఎందరో.. స్వాతంత్ర దేశం కోసం ఆత్మ బలిదానాలు చేసిన అమరవీరులెందరో.. వారందరినీ స్మరించుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుందాం..
ఎందరో అమరవీరుల త్యాగాలకి ఫలితం వచ్చిన ఈ రోజున.. ప్రతి ఒక్కరూ వారిని స్మరించుకుంటూ.. గణతంత్ర దినోత్సవ ప్రత్యేక శుభాకాంక్షలు.
భారతదేశం ఇంత గొప్ప చరిత్ర, వారసత్వాన్ని కలిగి ఉండడం మనం చేసుకున్న పుణ్యమే..ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేశంలో పుట్టినందుకు మనమంతా ఎంతో గర్వపడదాం.. మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగంలోని విలువలను సంరక్షిస్తూ..ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సమాజంలో జీవనం సాగించాలని కోరుకుంటూ.. ప్రతి ఒక్కరికి 75 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
తెల్ల దొరల పాలనపై ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి పోరాడిన ప్రతి ఒక్క అమరవీరుడిని స్మరించుకుంటూ..హ్యాపీ రిపబ్లిక్ డే.
ఈ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. మనమంతా స్వాతంత్రం కోసం పోరాడిన సమరయోధులను స్మరించుకుంటూ.. మన వారసత్వ సంపదను కాపాడుకుందామని ప్రతిజ్ఞ చేద్దాం..హ్యాపీ రిపబ్లిక్ డే..
భారతదేశంలో జాతులు వేరైనా.. మతాలు వేరైనా మనుషులు మాత్రం ఒకటే.. ఎల్లప్పుడు మన దేశం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ.. ప్రతి భారతీయునికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.