Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడు చారిత్రక పురుషుడా? పురాణ పురుషుడా? ఏది నిజం?

Mon, 15 Apr 2024-12:02 pm,

Happy Sri Rama Navami 2024: శ్రీరామ చంద్రుడు తండ్రి మాట కోసం వనవాసం చేశాడు. ఇంతలో సీతాపహరణం జరిగింది. రావణ సంహారం చేసి సీతను కైవసం చేసుకుంటాడు రాముడు. ఇదీ మూడుముక్కల్లో రామాయణం. కానీ ఇందులో అర్ధం పరమార్ధం మానవ జీవితంలో అడుగడుగునా అవసరమవుతుంది. భార్యాభర్తలు, అన్నదమ్ములు, రాజనీతి ప్రతి ఒక్కటీ రామకథలో దొరుకుతాయి.  అలాంటి రాముడు చారిత్రక పురుషుడా? పురాణపురుషుడా? ఏది నిజం? రాముడనే పేరెత్తగానే భారతీయుల నరనరాలు ఉప్పొంగుతాయి.

 

సర్వసుగుణాలనూ ఆయనలో చూసుకుని పులకించి పోవడం ఇక్కడి వారి ఆచారం. అలాంటి రాముడు దశావతారాల్లో ఏడో అవతరంగా చెబుతారు. దశావతారాలంటే వాటికి చారిత్రక ఆధారాలుండవు. ఈ కలికాలంలో రాముడ్ని ఎలా చూడాలి? రాముడనేవాడు నిజమనుకోవాలా? భ్రమగా భావించాలా?

 

శ్రీరామ చంద్రుడు పునర్వసు నక్షత్రంలో.. నవమి నాడు అయోధ్యలో జన్మించాడు. దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ చేయడానికి భువిపై అవతరించిన మహా పురుషుడు. రావణుడనే రాక్షస బాధలనుంచి ప్రజలను కాపాడే క్రమంలో భాగంగా.. శ్రీహరే రాముడనే పేరున మానవుడిగా జన్మించాడన్నది మన పురాణాలు చెబుతున్న మాట. రావణుడనే వాడు ఎవరో కాదు.. ఆయన ద్వారపాలకులల్లో జయ, విజయల్లో  ఒకరేనని చెబుతారు.

వీటన్నిటి దృష్ట్యా రాముడు పురాణపాత్ర. అయోధ్యలో పుట్టుకలో కూడా అనేక మిస్టరీలున్నాయి. రాముడి తండ్రి దశరథుడికి ముగ్గురు భార్యలు. వారికి ఎంతో కాలంగా పిల్లలు లేరు. అందుకోసం యాగం చేయగా.. పాయసం లభించడం.. దాన్ని తాగగానే పిల్లలు పుట్టడం.. రాముడి కథలో ప్రధానమైన విషయం. పురాణమంటే కాస్త అతిశయంగా వుండటంలో తప్పులేదు. ఆ మాట ఒప్పుకుంటాం కానీ రాముడున్నాడంటే మాత్రం ఒప్పుకోమనే వారున్నారు. ఇది కేవలం కల్పిత పాత్రగా కొట్టిపారేసే వారున్నారు.

దేవుడనే వాడికి చారిత్రక ఆధారాలను చూడాలనుకోడానికి మించిన మూర్ఖత్వం లేదనే వారున్నారు. చారిత్రక ఆధారాలుంటే వారిని చారిత్రక పురుషులంటారు తప్పించి దేవుడని ఎలా అనుకుంటాం? దేవుడన్నది ఒక భావన.

రాముడు దేవుడా కాడా? అన్న విషయం పక్కన పెడితే.. రామాయణం జరిగిందనడానికి ఉన్న చారిత్రక ఆధారాల్లో.. రామసేతు, అయోధ్య వంటి ఇష్యూస్ ముఖ్యమైనవి. రామాయణాన్ని, రాముడి జీవిత చరిత్రను తెలియ చెప్పే వాటిలో వీటిదే ప్రధాన పాత్ర.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link