Hardik Pandya Girlfriend: మళ్లీ ఫారిన్ పోరిని పట్టిన హార్థిక్ పాండ్యా.. స్టార్ సింగర్‌తో డేటింగ్.. పిక్స్ చూశారా..!

Wed, 14 Aug 2024-4:24 pm,

హార్థిక్ పాండ్యా రీసెంట్‌గా గ్రీస్‌లోని ఓ హోటల్ స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద నడుస్తున్న వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. అంతకుముందు నాలుగు రోజుల క్రితం సింగర్ జాస్మిన్‌ వాలియా కూడా అదే లోకేషన్‌లో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.  

అంతేకాదు ఇద్దరు ఒకరి పోస్టులకు ఒకరు లైక్ చేశారు. గతంలో జాస్మిన్ షేర్ చేసిన కొన్ని పోస్టులకు పాండ్యా కామెంట్స్ చేసేవాడు.  

ఈ నేపథ్యంలోనే జాస్మిన్‌తో పాండ్యా డేటింగ్‌లో ఉన్నాడని ఊహగానాలు మొదలయ్యాయి. ఇద్దరి పోస్టులు వైరల్ అవుతున్నాయి.  

ఇంగ్లాండ్‌కు చెందిన జాస్మిన్‌ టీవీ సిరీస్‌ల్లో యాక్ట్ చేసింది. ఆ తరువాత రియాల్టీ షోలతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. 2014లో నుంచి యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించి.. ఆల్బమ్స్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంది.  

హాట్ హాట్ పిక్స్‌తో నెట్టింట మంటలు రేపుతోంది. ఇన్‌స్టాలో ఈ భామకు 6.4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.  

ఇక పాండ్యా విషయానికి వస్తే.. 2019 డిసెంబర్‌ 31న నటాషాతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. నటాషాను మొదట రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న పాండ్యా.. 2023లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ ప్యాలెస్‌లో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నాడు.  

వీరికి కుమారుడు అగస్త్య ఉన్నాడు. జూలై 19న ఈ జంట వీడిపోతున్నట్లు ప్రకటించారు. అంతకుముందే కొడుకు అగస్త్యను తీసుకుని నటాషా సెర్బియా వెళ్లిపోయింది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link