Haryana Key Role in Paris Olympcis 2024: పారిస్ ఒలింపిక్స్‌లో హర్యానా ప్రతిభ, ఆరింట 4 పతకాలు
హర్యానా క్రీడాకారుల ప్రతిభ
పారిస్ ఒలింపిక్స్ 2024లో హర్యానా క్రీడాకారులు ప్రతిభ చాటారు. క్రీడల్లో తామే గ్రేట్ అని నిరూపించుకున్నారు. ఇండియాకు పతకాలు సాధించిపెట్టి దేశ గౌరవం నిలిపారు. ఇండయా గెల్చుకున్న పతకాల్లో 90 శాతం హర్యానా ఆటగాళ్లదే భాగం
మనూ భాకర్
ఈ జాబితాల మొదటి పేరు పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియాకు తొలి పతకాన్ని అందించిన మనూ భాకర్. ఈమె ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు గెల్చుకుంది. మూడవది తృటిలో మిస్సయింది. ఈమె హర్యానాలోని ఝాజర్ ప్రాంతానికి చెందింది
అమన్ శహరావత్
కుస్తీలో ఇండియాకు కాంస్య పతకం అందించిన అమన్ శహరావత్ కూడా హర్యానాకు చెందినవాడే కావడం గమనార్హం. దేశంలోని యువ పతక విజేతల్లో ఒకడు
నీరజ్ చోప్రా
జావెలిన్ త్రో విభాగంలో టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియాకు స్వర్ణం అందించిన నీరజ్ చోప్రా ఈసారి తృటిలో గోల్డ్ మిస్సయినా సిల్వర్ మెడల్ అందించాడు. ఇతడు హర్యానాలోని పానిపట్ ప్రాంతవాసి
ఇండియన్ హాకీ టీమ్
ఒలింపిక్స్‌లో దేశానికి మరో కాంస్యం అందించింది హాకీ టీమ్. ఈ హాకీ జట్టులో చాలామంది ఆటగాళ్లు హర్యానాకు చెందినవారే. సుమిత్, అభిషేక్ నైన్, సంజయ్ వంటి క్రీడాకారులున్నారు.